Telangana: 2004 మేనిఫెస్టోలోనే ప్రత్యేక తెలంగాణ..ఆ విషయాలు రివీల్ అయ్యాయిగా!

Telangana: గజఈతగాళ్లు గెడ్డలో పడి చనిపోయారని ఉత్తరాంధ్రలో ఓ పాపులర్ సామెత ఉంది. గజఈతగాళ్లు అంటే.. సముద్రంలోనో నదిలోనో ఏదైనా ప్రమాదం జరిగితే.. కాపాడటానికి ఈ గజఈతగాళ్లు రంగంలోకి దిగుతారు. ప్రాణనష్టం జరగకుండా ప్రమాదంలో ఉన్నవారిని కాపాడుతారు. కానీ, అలాంటి వారు చిన్న పిల్లకాలువలో పడి చనిపోతే ఎలా ఉంటుంది?

 

ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డి ట్రబుల్ షూటర్ లాంటివారు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. కేంద్రపెద్దలతో వైసీపీకి ఇంత సఖ్యత ఉంది అంటే ఆయనే కారణం. కేంద్ర పెద్దల దగ్గర ఆయన చేసే లాబీయింగ్ అంతా ఇంతా కాదు. దాని వలనే వైసీపీకి, జగన్ కు, ఆ పార్టీ నేతలకు కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అయితే.. అలాంటి వ్యక్తి రాజ్యసభలో వ్యూహత్మక తప్పిదం చేశారు. కాంగ్రెస్ పార్టీని నిందించాలనే ఉద్దేశ్యంతో చేసిన కామెంట్స్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీని తిట్టడం కోసం విభజన హామీల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ పార్టీల వలనే వలనే తెలుగు రాష్ట్రాలకు ఈ దుస్థితి ఏర్పడందని అన్నారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం అనే అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. అప్పుడే ఓ పద్దతి ప్రకారం చేస్తే ఇవాళ ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు. అసలు విజయసాయి రెడ్డి ఎందుకు ఈ కామెంట్స్ చేశారో కూడా అర్థం కావడం లేదు. 2004లో రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లింది. కాంగ్రెస్ అప్పుడు మాట నిలబెట్టుకోలేదు అంటే.. రాజశేఖర్ రెడ్డి మాట తప్పారనే అర్థం వస్తుంది. అంతేకాదు.. ఇవాళ ఏపీ దుస్థితికి కారణం కాంగ్రెస్ మాట నిలబెట్టుకోకపోవడమేనని కూడా అన్నారు. అంటే ఇవాళ ఏపీలో దారణమైన పరిస్థితులకు వైఎస్ఆర్ కారణమని చెప్పకనే చెబుతున్నారు. విజయసాయి రెడ్డి ఈ కామెంట్స్ వ్యూహాత్మకంగా చేశారా? పొరపాటున చేశారో తెలియదు కానీ..రాజశేఖర్ రెడ్డి అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి.

 

అయితే.. ఇక్కడ ఇంకో విశ్లేషణ కూడా వినిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డిపై కావాలనే ఈ కామెంట్స్ చేశారని రాజకీయ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకునే పనిలో షర్మిల పడ్డారు. తన ప్రసంగాలు అన్ని ఆ యాంగిల్ లోనే ఉన్నారు. ప్రజలు కూడా ఆమె స్పీచ్ కి కనెక్ట్ అవుతున్నారు. రాజన్న బిడ్డగా ఆమె తక్కువ టైంలోనే ప్రజల్లోకి వెళ్లినట్టు వైసీపీ అభిప్రాయపడుతోంది. నెమ్మదిగా వైఎస్ లెగసీని వైసీపీ కోల్పోతుందనే భయం జగన్ కు పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. వైఎస్ లెగసీ వైసీపీకి దూరమయ్యే పరిస్థితే వస్తే.. వైఎస్‌ను డీ గ్లామరస్ చేయడమే బెటర్ అని ఆలోచనకు జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే విజయసాయిరెడ్డి ఆ కామెంట్స్ చేశారని ప్రచారం నడుస్తోంది.

 

రాజ్యసభలో విజయసాయిరెడ్డి మరో కామెంట్ కూడా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని కూలిపోతుందని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీసేలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు జగన్ కూడా సాయం చేస్తారని చర్చ నడుస్తోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా విజయసాయిరెడ్డి కామెంట్స్ ఉన్నారు. అసలే పట్టడు కష్టాల్లో ఉన్న వైసీపీ తెలంగాణ కాంగ్రెస్ ను కెలికి మరీ కష్టాలకు కొని తెచ్చుకున్నట్టు అయింది. మరి చూడాలి విజయసాయిరెడ్డి కామెంట్స్ వైసీపీకి ఎంత మేరా డ్యామేజ్ చేస్తాయో?

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -