Pawan: ఓజీ.. ఈ హైప్ ఏందయ్యా సామి.. పవన్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా రికార్డులు ఖాయమా?

Pawan: తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు అజయ్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన సపోర్టింగ్ క్యారెక్టర్లలో విలన్ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మొదట దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రస్థానం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా తర్వాత నుండి ఆయన జాతకమే మారిపోయింది.

ఈ సినిమాలో ప్రెసిడెంట్ గారి పక్కన అసిస్టెంట్ గా ఉండే పాత్రని పోషించిన అజయ్ ఘోష్ పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోయింది. అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ లో ఉంటూ సరైన గుర్తింపు లేక, చిన్న పాత్రలు పోషిస్తూ, వాటి ద్వారా వచ్చే డబ్బులతో ఇల్లు కూడా గడవని పరిస్థితి నుండి ఒక్కసారిగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ లో ఒకడిగా మార్చేసింది. ఇప్పుడు ప్రతీ శుక్రవారం విడుదల అయ్యే తెలుగు సినిమాల్లో అజయ్ ఘోష్ లేని సినిమా అంటూ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమాల్లోకి రాకముందు ఈయన స్వస్థలం ఒంగోలులో కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడట.

 

సినిమాలపై ఉన్న పిచ్చి ఇష్టంతో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడట. పాపం తనతో తెచ్చుకున్న డబ్బులు మొత్తం అయిపోవడంతో ఆకలితో పస్తులు ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయట. అంతే కాదు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు కూలీపనులు కూడా చేసేవాడట. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు అజయ్ ఘోష్. పుష్ప , రంగస్థలం వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన అజయ్ ఘోష్ లో తాను ఒక సెలబ్రిటీని అనే గర్వం ఇసుమంత కూడా లేదట. ఇప్పటికీ ఒంగోలు రోడ్ల మీద చాలా సాధారణ మనిషి లాగా తిరుగుతూ ఉంటాడు అజయ్ ఘోష్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అలాగే సక్సెస్ ఈవెంట్స్ లో కూడా ఆయన భుజం మీద ఎర్ర తుండు వేసుకొని వస్తుంటాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -