Om Raut: వారి కోసమే రావణాసురుడి పాత్ర అలా చూపించమంటున్న డైరెక్టర్!

Om Raut: ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ ఏ విధంగా విమర్శలు ఎదుర్కొంటుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు ఈరోజు వరకు కూడా చాలా నిరాశగా ఉన్నారు. చాలామంది ఈ సినిమా టీజర్ గురించి నానా రకాలుగా ఏకీ పారేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ గురించి.. రావణాసురుడి పాత్ర గురించి డైరెక్టర్ ఓం రౌత్ స్పందించాడు.

రావణాసురుడు చాలా క్రూరత్వం కలిగిన వ్యక్తి, లుక్స్ తోనే అతని క్రూరత్వాన్ని చూపించాలి. గతంలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో పొడవైన జుట్టు, గంభీరమైన చూపులు ఇలా భారీ ఆకారంలో రావణాసురుడిని చూపించారు. ఆ రోజుల్లో క్రూరత్వాన్ని ఆ విధంగా చూపించారు. కానీ ఇప్పటితరం, భవిష్యత్తు తరాల వారికి ఈ సినిమా చేరాలి అనుకుంటున్నాం. ఈ సినిమా ద్వారా రాముడు గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజేయాలి అనుకుంటున్నాము.

అందుకుగాను రావణాసురుడి లుక్ ను ఆ విధంగా డిజైన్ చేశాము. ఇక రావణాసురుడు ఒక భయంకరమైన పక్షి మీద ప్రయాణించే లుక్ ను టీజర్ లో చూపించాము. అయితే దీన్ని కూడా అందరూ తప్పుగా ఆలోచిస్తున్నారు. కేవలం 95 సెకండ్ల వీడియో చూసి అభిప్రాయానికి రావద్దు. సినిమా చూశాక మాట్లాడండి అని ఓం రౌత్ అన్నాడు. ఇక ఆ సినిమాలో హనుమంతుడికి లెదర్ దుస్తులు వేసేమని అందరూ అంటున్నారు.

కానీ ఈ సినిమాలో ఎటువంటి లెదర్ దుస్తులను వాడలేదని డైరెక్టర్ ఓం రౌత్ తెలిపాడు. ప్రస్తుతం డైరెక్టర్ ఓం రౌత్ స్పందనకు రెబల్ స్టార్ అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఓం రౌత్ చెప్పిన మాటల్లో కొంచెం వాస్తవమే కనిపిస్తుంది. మరి ఈ సినిమా థియేటర్లో విడుదలయ్యాక వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ మాత్రం ఈ సినిమా విషయంలో బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -