Telangana: తెలంగాణ వాసులకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్.. ఏమైందంటే?

Telangana: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఆదిపురుష్ సినిమా పేరే వినిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కోట్లలో ఈ సినిమా కలెక్షన్స్ ని రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే తెలంగాణలో ముందుగానే ఊహించినట్లు కొన్ని మెలికలు పెట్టారు. టికెట్ పై 50 రూపాయలు పెంచారు. అంటే మల్టీప్లెక్సులకు గరిష్ట ధర 295 ఉంటుంది. దీనికి త్రీడి ఛార్జీలు ప్లస్. దీన్ని బట్టి ఆర్ఆర్ఆర్ లాగా విపరీత రేట్లకు ఆస్కారం లేకపోవడం నైజామ్ ప్రేక్షకులకు ఒక రకంగా శుభవార్తే. సింగల్ హాళ్లకు సైతం 225 మించే ఛాన్స్ లేదు. ఏ క్షణమైనా బుక్ మై షో, పేటిఎంలో సేల్స్ మొదలు పెడతారు. అయితే ఇక్కడ మరో శుభవార్త ఏంటంటే ఫస్ట్ డే ఆరో ఆటకు పర్మిషన్ ఇవ్వడం. ఉదయం 4 గంటలతో మొదలుపెట్టి రోజు మొత్తం ఆరు షోలు వేసుకోవచ్చు. ఇది సానుకూల నిర్ణయం. పైన చెప్పిన పెంపు కేవలం మూడు రోజులు అంటే ఆదివారం వరకే పరిమితం చేశారు.

 

సోమవారం నుంచి పాత రేట్లే ఉంటాయి. నిజానికి డిస్ట్రిబ్యూటర్లు ఈ స్లాట్ నే కోరుకున్నారు. ఎంత ఆదిపురుష్ మీద క్రేజ్ ఉన్నా స్కూళ్ళు తెరిచేసి సెలవులు పూర్తయిన టైంలో మరీ ఎక్కువ రేట్లు పెడితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆశించిందే వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఇదే 50 రూపాయల అనుమతి రానుంది. కాకపోతే అక్కడ మల్టీప్లెక్స్ బేసిక్ ప్రైస్ 177 కాబట్టి తెలంగాణతో పోలిస్తే మరీ తీవ్రంగా ఉండబోదు. సింగల్ స్క్రీన్లలో అక్కడ అమలులో ఉన్న ధర 110. సో ఫైనల్ గా 160 మించదు. మొత్తం 185 కోట్లకు హక్కులు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆదిపురుష్ ఫలితం మీద చాలా నమ్మకంగా ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -