Junior NTR: ఓరి దేవుడా.. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఆ రేంజ్ లో ఉండనుందా?

Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఎలా ఉండబోతుందో తాజాగా కెమెరామెన్ రత్న వేలు చేసినటువంటి ట్వీట్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా నుంచి ఈయన ఒక క్రేజీ అప్డేట్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు.ఇప్పటికే ఈ సినిమా నాలుగు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది ఇవన్నీ కూడా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కలిగి ఉన్నాయని తెలుస్తోంది.

 

ఈ క్రమంలోనే తాజాగా కెమెరామెన్ రత్న వేలు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. వెన్నెలతో ఎంతో ప్రకాశవంతంగా ఉన్న సముద్రం పై భయంకరమైన రక్తదానంతో కూడిన యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేశామని ఈయన పోస్ట్ చేశారు. ఇలా ఈయన పోస్ట్ చూసినటువంటి ఎన్టీఆర్ అభిమానులు కళ్ళ ముందు ఊహించుకొని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈయన అప్డేట్ ఇవ్వడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

 

ఇకపోతే ఎన్టీఆర్ దేవర సినిమాలో ఇదే సీన్ తోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నారు. అదేవిధంగా నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.ఈ సినిమా నవంబర్ నెలలో షూటింగ్ పనులను పూర్తి చేసుకోవాలని మేకర్స్ శర గంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -