Ormax Survey: నెంబర్ వన్ హీరోగా విజయ్.. ప్రభాస్, ఎన్టీఆర్ లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసా?

Ormax Survey: సినిమాలకు సంబంధించి కొన్ని సంస్థలు అన్ని ఇండస్ట్రీలు కలిపి స్టార్ హీరోల గురించి ఒక సర్వే చేస్తూ ఉంటాయి. ఆ సర్వే ప్రకారం టాప్ హీరో ఎవరు అని తెలుపుతూ ఉంటారు. ఇక ఇదే నేపథ్యంలో ఓర్ మాక్స్ సంస్థ చేసిన మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ లో టాప్ టెన్ లో తమిళ నటుడు. విజయ్ అగ్రస్థానంలో ఉన్నట్లు చూపించారు. అలాగే రెండవ స్థానంలో ప్రభాస్ ఉన్నాడట.

ఇక మూడవ స్థానంలో ఎన్టీఆర్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్ లు ఉన్నారట. మరి కేజిఎఫ్ ఫేమ్ యష్ విషయానికి వస్తే ఇతడు ఐదవ స్థానంలో ఉన్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆరవ స్థానంలో ఉన్నాడు. ఇక రాంచరణ్ విషయానికి వస్తే ఏడవ స్థానంలో ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎనిమిది. స్టార్ హీరో సూర్య 9, అజిత్ పదవ స్థానాన్ని దక్కించుకున్నాడు.

అలాగే ఓర్ మాక్స్ సంస్థ చేసిన పాపులర్ ఫిమేల్ స్టార్స్ విషయానికొస్తే మొదటిగా సమంత నెంబర్ వన్ గా నిలిచింది. ఇక మిగిలిన 9 మందిలో ఆలియా భట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనే, రష్మిక మందన్న, కత్రినా కైఫ్, పూజ హెగ్డే, అనుష్క శెట్టి లు టాప్ టెన్ లో కనిపిస్తున్నారు. ఇక మోస్ట్ పాపులర్ సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్న పుష్ప 2 ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రాబోతున్న సలార్ మూవీ ఆది పురుష్ సినిమాలు కనిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు త్వరలో రాబోయే పాపులర్ మూవీగా అనిపిస్తుంది. ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ రాబోయే ఖుషి సినిమా కూడా కనిపిస్తుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా మెప్పిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -