Chiranjeevi: సాయి ధరమ్ తేజ్ తండ్రి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఏంటో తెలుసా?

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చారు. ఈ విధంగా ఎంతోమంది దర్శక నిర్మాతలను కోటీశ్వరులను చేసిన ఘనత చిరంజీవికి ఉందని చెప్పాలి.

చిరంజీవి పై నమ్మకంతో ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇతనితో సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు ఆయన బావగారైన అల్లు అరవింద్ ఎన్నో సినిమాలను నిర్మించారు.అయితే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి సాయి ధరమ్ తేజ్ తండ్రి పంజా ప్రసాద్ గురించి మనకు తెలిసిందే. ఈయన కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

పంజా ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి సినిమాని నిర్మించిన విషయం బహుశా చాలామందికి తెలియదు. ఆయన చిరంజీవితో కలిసి ఒకే ఒక చిత్రాన్ని నిర్మించారు.మరి చిరంజీవి తన బావ పంజా ప్రసాద్ నిర్మాణంలో ఏ సినిమాలో నటించారనే విషయానికి వస్తే.. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో దివ్యభారతి, శోభన హీరోయిన్లుగా చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం రౌడీ అల్లుడు.

ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో సాయిరాం ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి తోడల్లుడు డాక్టర్ కే వెంకటేశ్వరరావు అలాగే తన బావ పంజాప్రసాద్ (సాయి ధరమ్ తేజ్ తండ్రి) ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు అన్నింటిని అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకున్నారు. ఇక ఈ బ్యానర్ లో తెరకెక్కిన ఏకైక చిత్రం రౌడీ అల్లుడు. ఇక ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయమందుకుందో మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -