Paper Cups: పేపర్‌ కప్పులో టీ తాగితే అలాంటి రోగాలు రావడం గ్యారెంటీ!

Paper Cups: సాధారణంగా చాలామంది టీ, కాఫీ ఎక్కువసార్లు తాగడం అలవాట్లు. అలా కాఫీ టీలు తాగడానికి బయట హోటళ్లకు, కాఫీ షాపులకు, లేదంటే కేఫ్ లకు వెళుతూ ఉంటారు. అయితే అక్కడ మనం కాఫీ టీ తాగినప్పుడు మనకు టీ షాపు యజమాని కాఫీ కప్, గాజు గ్లాస్ లో ఇస్తుంటారు. ఏదైనా పెద్ద హోటల్ లాంటి దానికి వెళ్తే అక్కడ కప్పు సాసర్లలో ఇస్తూ ఉంటారు. ఇకపోతే చిన్న హోటల్స్ కీ వెళ్తే అక్కడ చాలా వరకు పేపర్ కప్స్, లేదా ప్లాస్టిక్ కప్పులను టీ తాగడానికి ఇస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ టీ కప్పుల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. కానీ కరోనా విజృంబన తర్వాత పేపర్ కప్పుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న హోటల్స్ నుంచి పెద్ద హోటల్స్ వరకు ఎక్కడ చూసినా కూడా పేపర్ కప్పులనే ఉపయోగిస్తున్నారు.

అయితే ఈ పేపర్ కప్పుల ఆరోగ్యం పాడవుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. పేపర్ కప్పులో టీ తాగడం వల్ల అనారోగ్యాల పాలవుతారు అని ఖరగ్ పూర్ ఐఐటి పరిశోధకులు తెలిపారు. డిస్పోజబుల్ పేపర్‌ కప్పుల్లో మూడుసార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున టీ తాగడం వల్ల 75 వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోనికి ప్రవేశిస్తాయని తేల్చారు. అయితే 80 నుంచి 90 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడి కలిగిన 100 మిల్లీలీటర్ల ద్రవ పదార్థం ద్వారా దాదాపు 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోకి చేరతాయని పరిశోధకులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మన శరీరంలోకి క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు కూడా వెళ్తాయని అంటున్నారు. అయితే పేపర్‌ కప్పుల్లో టీ పోసినప్పుడు ఆ పేపర్‌లోని మైక్రోప్లాస్టిక్‌ కణాలతో పాటు ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోయి శరీరంలోకి వెళ్తున్నాయని తెలిపారు.

అయితే పేపర్‌ కప్పులు హైడ్రోఫోబిక్‌ ఫిల్మ్‌ అనే ఒక సన్నటి పొరతో తయారవుతాయని,ఇందులోనూ పాలీ ఇథలీన్‌ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ పేపర్ కప్పులలో టీ లేక ఇతర ఏ వేడి ద్రవం పోసినా 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్‌ లేయర్‌లో చర్య జరుగుతుందని వారు వివరించారు. మరి ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకొని పేపర్ కప్పుల వాడకండి తగ్గిస్తారో లేదో చూడాలి మరి. కదా ఇటీవల కాలంలో ఈ పేపర్ కప్పుల వాడకాన్ని, క్లాసిక్ వాడకనిషేధించిన విషయం తెలిసిందే. దీనితో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గాజు కప్పులు, లేదంటే స్టీల్ గ్లాసులే దర్శనమిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -