Paritala Sriram: ఔను సర్దుకుపోతా.. బీజేపీని గెలిపిస్తా.. పరిటాల శీరాం మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

Paritala Sriram: రాప్తాడు నియోజకవర్గంలో టిడిపి కంచుకోటగా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ కి ఎన్నికలలో ఆశించిన స్థాయిలో టికెట్ రాలేదని చెప్పాలి. తమ కుటుంబం నుంచి రెండు ఎమ్మెల్యే టికెట్లు రావాలని పట్టుబట్టారు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తున్నట్లు వెల్లడించారు తన తల్లికి రాప్తాడు తనకు ధర్మవరం టికెట్ ఇవ్వాల్సిందేనని గతంలో శ్రీరామ్ పట్టుబట్టారు కానీ రాప్తాడు నియోజకవర్గం పరిటాల సునీతకు టికెట్ కన్ఫర్మ్ చేశారు.

ఇక ధర్మవరంలో తనుకు టికెట్ వస్తుందని ఆశించినటువంటి శ్రీరామ్ కు చేదు అనుభవం ఎదురయింది. ఈ క్రమంలోనే తనకు టికెట్ రాకపోవడంతో అందరి నాయకులు మాదిరిగా పార్టీని దూషించలేదు అయితే ఈయన ఈ విషయంపై స్పందిస్తూ నేను గత నాలుగున్నర సంవత్సరాలుగా ధర్మవరంలోనే ఉంటున్నాను ప్రజల మధ్య తిరుగుతున్నాను ప్రతి ఒక్క గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాను కానీ నాకు టికెట్ ఇవ్వకపోవడంతో కాస్త బాధ అనిపించిందని తెలిపారు.

ఇలా తనకు టికెట్ రాకపోయినా నేను పార్టీకి మద్దతు తెలుపుతానని కూటమిలో భాగంగా ఈ నియోజకవర్గానికి బిజెపి నేత సత్య కుమార్ కి టికెట్ ఇచ్చారు. అధిష్టానం నిర్ణయం మేరకు మేము కట్టుబడి ఉంటామని సత్యకుమార్ గారిని గెలిపించుకునే బాధ్యత మాది అంటూ ఈయన తెలియజేశారు. ధర్మవరంలో టీడీపీ సింబల్ మాత్రమే లేదని.. బీజేపీ ఉన్నా.. అది టీడీపీ కిందే ఉంటుంద‌ని చెప్పారు. మిగిలినదంతా సేమ్ టు సేమ్ అంటూ తెలియజేశారు. తనకు టికెట్ రాకపోతే పార్టీని వదిలి పారిపోయే అంత పిరికివాడు తాను కాదని ఇన్ని రోజులు త్యాగమంటే మాటల్లో కాదని చేతుల్లో కూడా చూపించామని తెలిపారు. కష్టం వచ్చినా నష్టం వచ్చిన తన ప్రయాణం మాత్రం ధర్మవరం ప్రజలతోనే ముందుకు సాగుతుందని ఈయన ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు పట్ల పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -