Pavitra Lokesh: మెయింటెనెన్స్ లో స్టార్ హీరోయిన్లకే మించిపోయిన పవిత్రా లోకేశ్

Pavitra Lokesh:  సినీ ఇండస్ట్రీలో ఫుకార్లు కామన్. స్టార్ హీరో, హీరోయిన్ల వార్తలను మీడియా ఎక్కువ కవరేజ్ చేస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో పని చేసే ఏ ఒక్కరైనా ఎప్పుడూ వార్తల్లో ఉండాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన ప్రతి వార్త ఎప్పుడూ తెర ముందుకు వస్తుంటుంది. వీటిని చూడటానికి తమ అభిమానులు సైతం ఎంతో ఆసక్తి చూపుతుంటారు. డైలీ అప్‌డేట్స్ తో అభిమానులను తమ వైపు తిప్పుకోవడానికి, ఫాలొవర్స్ పెంచుకోవడానికి సెలబ్రిటీలు తెగ ఆరాటపడుతుంటారు. అలా ఎప్పుడూ వార్తల్లో కనిపించే పేరు ‘పవిత్రా లోకేశ్’.

పవిత్రా లోకేశ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వయసు పైబడినా.. వయసుతో సంబంధం లేకుండా సినిమాల్లో, తన వ్యక్తిగత విషయాలలో ఫుల్ బిజీగా ఉంటారు. ఇటీవల ఆమె చేసిన ఓ నిర్వాకం గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ ఇష్యూ వల్ల పవిత్రా లోకేశ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. స్టార్ నటుడు నరేష్‌తో పవిత్రా లోకేశ్ కలిసి ఉండటం విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరు ఓ హోటల్ గదిలో అడ్డంగా దొరికిన విషయం సెన్సేషనల్ అయింది. నరేష్ భార్య వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అప్పుడు వీరిద్దరి మధ్య చాలా పుకార్లు వచ్చాయి. కొద్ది నెలలపాటు వీరిద్దరి ఫ్యామిలీనే వార్తల్లో కనిపించింది.

దీంతో ఒక్కసారిగా పవిత్రా లోకేశ్ గురించి తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో పవిత్రా లోకేశ్ అన్ని రకాల మెయింటెనెన్స్ చేస్తారట. తీసుకునే ఆహారం దగ్గరి నుంచి డైట్, ఎక్సర్‌సైజ్ విషయంలో స్టార్ హీరోయిన్లకు మించి మెయింటెనెన్స్ చేస్తుంటారట. అలాగే డ్రెస్సింగ్ స్టైల్‌లో కూడా బ్రాండ్ ఐటమ్స్ మాత్రమే వాడుతారట. లక్షల ఖరీదైన క్రీములను వాడటం, వారానికి ఒకసారి బ్యూటీపార్లర్‌కు వెల్లడం వంటి పనులు చేస్తుంటారట. అలాగే రోజూ కొబ్బరి నీళ్లు తాగుతారని ఇండస్ట్రీలో ఫుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త విన్న ప్రతిఒక్కరూ మరోసారి ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -