Pavitra Lokesh: ఆత్మహత్య చేసుకోవాలని అంటున్న పవిత్ర లోకేశ్.. ఏం జరిగిందంటే?

Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారినటువంటి వారిలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంట ఒకటి వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్ లో ఉంటూ తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి పవిత్ర లోకేష్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.నరేష్ తో తాను రిలేషన్ లో ఉన్న సమయంలో తన గురించి ఎన్నో రకాల వార్తలు సృష్టించారని తనని భారీగా ట్రోల్ చేశారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నా వ్యక్తిత్వాన్ని ఖననం చేసి నా కెరియర్ పై దెబ్బ కొట్టాలని చూశారు. ఆ సమయంలో నాకు రెండే మార్గాలు ఉన్నాయని తెలియజేశారు.

 

ఒకటి ఆత్మహత్య చేసుకోవడం లేదా బయట ఎవరికి కనిపించకుండా ఇంట్లోనే కూర్చోవడం నా ముందు ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే కనిపించాయని పవిత్ర లోకేష్ తెలియజేశారు. అయితే ఆ సమయంలో మాత్రం నరేష్ తనకు చాలా అండగా నిలిచి తనని బయటకు తీసుకువచ్చారని పవిత్ర వెల్లడించారు.నరేష్ గారు నా వెంట ఉండి నన్ను ధైర్యంగా ముందుకు నడిచేలా చేశారని పవిత్ర లోకేష్ తెలియజేశారు.

 

ఇక నరేష్ గాని నేను కానీ ఎప్పుడూ కూడా ఒకరికి హాని చేయాలన్న ఆలోచనలే చేయమని మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నామని పవిత్ర లోకేష్ వెల్లడించారు. ఇక మా బంధానికి అందరి మద్దతు కూడా ఉందని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -