Pawan CM: పవన్ జాతకంలో సీఎం యోగం.. ఎప్పుడు అవుతారంటే?

Pawan CM: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం వేడీ పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ ఎమ్మెల్యే సీటు కూడా చివరకు వైసీపీ గూటికే చేరుకుంది. దాంతో పవన్ పార్టీపై ఘోరమైన అవమానం జరిగింది. అయితే గత ఎన్నికల్లో జరిగిన అవమానాన్ని ఈ ఎన్నికల్లో సమాధానం చెప్పాలని, వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ సాయశక్తులా శ్రమిస్తున్నారు. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నెగ్గకపోతే రాజకీయ మనుగడ కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ సారి జరిగే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని కసితో పోరాడుతున్నారు.

 

అయితే ఈ సారి పవన్ కళ్యాణ్‌ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. గతంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేశారు. అయితే సేఫ్ ప్లేస్‌లో పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెడతారా? లేదా టీడీపీతో పొత్తుతో పెట్టుకుని పవన్ ఎమ్మెల్యే అవుతారా? అనే విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. అయితే పరువు పోయిన చోటే వెతుక్కోవాలని.. ఆ లాజిక్‌తో మళ్లీ ఈ రెండు స్థానాల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

 

మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చక్రం తిప్పాలని అనుకుంటోంది. పవన్‌ను ఎలాగైనా సీఎంగా చూడాలని అటు అభిమానులు, జనసైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే పవన్‌ కళ్యాణ్ సీఎం ఎప్పుడు అవతారనే విషయంపై ఓ వార్త వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం.. మరో 5 ఏళ్ల తర్వాత సీఎం అయ్యే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ పవన్ అందుకు అనుగుణంగా శ్రమించాలని, గట్టిగా తలుచుకున్నప్పుడే సీఎం అవ్వగలడని టాక్. దానికి పవన్ కళ్యాణ్ మరింతగా కష్టపడాల్సి ఉందని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -