Pawan Kalyan: పాదయాత్ర పై పవన్ కల్యాణ్ క్లారిటీ.. తేల్చేసిన జనసేనాని

Pawan Kalyan: ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. తెలంగాణలో ఎన్నకలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ పాదయాత్రలు మొదలుపెట్టేశాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర పేరుతో బలంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక వైఎస్సార్ టీపీ పేరుతో తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర మొదలుపెట్టేశారు.

ఇక త్వరలో రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర మొదలుపెట్టే అవకాశముంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేయనున్న జోడో పాదయాత్రలో భాగంగా తెలంగాణలో కూడా పాదయాత్ర చేయనున్నార. ఇలా టీఆర్ఎస్ ను ఓడించేందుకు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తో పాటు షర్మిల పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల సెంటిమెంట్ బలంగా ఉంది. పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్రలు చేపట్టి అధికారంలోకి వచ్చారు.

దీంతో పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామనే భరోసా పార్టీలలో ఉంది. అందుకే ప్రతి ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేయడం ప్రతిపక్ష, విపక్ష పార్టీలకు సెంటిమెంట్ గా మారింది. ఇక ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో త్వరలో లోకేష్ పాదయాత్ర చేసే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. అయితే పవన్ కూడా పాదయాత్ర చేసే అవకాశముందనే ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశంలో దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాదయాత్ర చేసే ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. పాదయాత్రలు చేస్తేనే అధికారంలోకి వస్తారా అంటూ ప్రశ్నించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, శిందే లాంటి వాళ్లు పాదయాత్రలు చేయలేదు కదా అంటూ ప్రశ్నించారు. పాదయాత్రలు చేస్తేనే అధికారంలోకి వస్తామనేది ఒక భ్రమ అంటూ కొట్టిపారేశారు. దీనిని బట్టి చూస్తే పవన్ కు పాదయాత్ర చేసే ఆలోచన లేదని తెలుస్తోంది.

పాదయాత్ర చేయాలని పలువురు నేతలు పవన్ కు సూచించారు. పార్టీ బలోపేతం అవ్వడంతో పాటు ప్రజల్లో కూడా మంచి మైలేజ్ వస్తుందని పవన్ కు తెలిపారు. కానీ సినిమాల కారణంగా పాదయాత్రలు చేయలేని పరిస్ధితి. దీంతో అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలకు జనసేన శ్రీకారం చుట్టింది. తిరుపతి నుంచి మొదలుకానన్న బస్సు యాత్ర అన్ని జల్లాల్లో జరగనుంది. ఇప్పటికే దీనిపై జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -