Pawan Kalyan: ఆత్మహత్య చేసుకోబోయా.. అన్న వదినలు చూడటంతో బ్రతికిపోయా.. పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి వచ్చిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి సపోర్టుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకున్న క్రేజ్ మాత్రం భారీగా ఉందని చెప్పాలి.ఇకపోతే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు పెద్ద ఎత్తున ఈయన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గతంలో ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి పెద్దగా స్నేహితులు ఎవరూ లేరని ఉన్న స్నేహితులతో తన అభిప్రాయాలు కలవకపోవడం వల్ల తాను చిన్నప్పటినుంచి ఒంటరిగానే గడిపే వాడిని అంటూ తెలిపారు.

ఇకపోతే ఎనిమిదవ తరగతి నుంచి తాను పరీక్షలలో తప్పడం వల్ల ఎంతో నిరుత్సాహానికి గురయ్యానని పవన్ వెల్లడించారు. ఇక ఇంటర్ ఫెయిల్ కావడం తనని ఎంతగానో కృంగతీసిందని, తనతోపాటు ఉన్నటువంటి మిత్రులందరు జీవితంలో ఉన్నత స్థానానికి వెళుతుండగా తాను మాత్రం ఎంతో నిరుత్సాహంతో కుమిలిపోయానని అదే సమయంలోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించానని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.అయితే ఆరోజు తన కుటుంబ సభ్యులు చూడటం వల్లే తాను ఆత్మహత్య చేసుకోవడం విరమించానని అయితే తన అన్నయ్య చిరంజీవి వదిన సురేఖ అండ ఉండటం వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నానని పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -