Pawan: అడ‌ప‌డ‌చుల భ‌ద్ర‌త‌పై ప‌వ‌న్ సూక్తులు.. నెటిజన్ల ట్రోల్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

Pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై చాలా ఫోకస్ చేశారు. ఈ క్రమంలోని ఈయన వారాహి యాత్ర చేయడమే కాకుండా అవకాశం దొరికిన ప్రతిసారి ఏపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తుంటారు. అయితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ మాటలలో ఒక స్పష్టత ఉండదని నిలకడ ఉండదని మనకు తెలిసిందే. మనం ఎవరికైనా కొన్ని సలహాలు ఇచ్చేటప్పుడు ఆ సలహాలను పాటించినప్పుడే మనం ఇచ్చే సలహాలకు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది.

పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా విభిన్నమని చెప్పాలి ఆయన మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు ఏమాత్రం పొంతన ఉండదు. ఈరోజు మాట్లాడిన మాటను రేపటికి మార్చేస్తారు. ఇలా మాట మీద నిలకడ లేనటువంటి వ్యక్తి ప్రభుత్వ పనితీరుపైన అలాగే ఇతర విషయాలలోనూ పెద్ద ఎత్తున నీతులు చెబుతూ ఉంటారు. అయితే తాజాగా రాఖీ పండుగ సందర్భంగా ఈయన రాష్ట్రంలోని అక్క చెల్లెలు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూనే ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పక్షాన జన సేన శ్రేణుల పక్షాన అక్క చెల్లెలు అందరికీ రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. ఆడపిల్లలకు రక్షగా ఉంటామని రాఖీ కట్టించుకున్న మనం మన కళ్ళు ఎదుటే ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఈ సమాజం ముఖ్యంగా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం శ్రేయస్కరం కాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 30 వేల మంది అమ్మాయిలు మహిళలు అదృశ్యమయ్యారని లెక్కలను అధికారులు చెబుతున్న ఏపీ ప్రభుత్వాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఈ విషయం తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని పవన్ తెలిపారు.

 

ఇలా అదృశ్యమైన వారి తల్లిదండ్రుల అర్థనాధలు వింటే బాదేస్తుందని, వారి బాదలు వినే వారు ఎవరు అంటూ ఈయన ప్రశ్నించారు.ఎప్పుడైతే ఆడపడుచుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందో అప్పుడే నిజమైన రక్షాబంధన్ అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయాలపై పలువురు నెటిజన్స్ పవన్ కళ్యాణ్ దారుణంగా టోల్ చేస్తున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు అమ్మాయిలకు అన్యాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడుతున్నారా అంటూ ఈయనపై చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -