Diabetes: షుగర్‌ ఉన్నవాళ్లు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.. లేకుంటే కష్టమే!

Diabetes:  ఒకప్పుడు పదిమందిలో ఒకరికి అదికూడా వయస్సుపై బడిన వారికి షుగర్‌ వ్యాధి వచ్చేది. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఒకరికి ఈ వ్యాధి ఉంది. మనదేశంలో 20–70 వయస్సు గల జనాబాలో 8.7 శాతం మందికి షుగర్‌ వ్యాధి ఉంది. ఈ వ్యాధిపై చాలా మందికి ఇప్పటికి అవగాహన లేదు. డయాబెటిస్‌పై చాలా మందిలో వివిధ రకాల అపోహాలు ఉన్నాయి.ఇలాంటి అపోహాలపై అవగాహన ఎంతో అవసరమని పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా సూచిస్తున్నారు.

షుగర్‌ ఉన్న వాళ్లు కార్బ్స్‌ తినకూడదు నిజమా?

షుగర్‌ వ్యాధి ఉన్న వాళ్లు కార్బోహైడ్రేట్లు తినకూడదు అనేది అవాప్తవం. పిండిపదార్థాలతో డయాబెటిస్‌ ఉన్న వాళ్లకు ఎలాంటి హానీ కాదన్నారు. మానవ శరీరానికి ఎంతో కొంత కార్బోహైడ్రేడ్లు అవసరమవుతాయని బాత్రా పేర్కొంటున్నారు. కార్బ్స్‌ ఎలాంటి సమయంలో తినాలి? ఎంత మేరకు తినాలో పలు జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవచ్చన్నారు.

డయాబెటిస్‌తో జీవితంతా పోరాడాలా?

ఒకసారి డయాబెటిస్‌ వస్తే జీవితాంతం ఈ సమస్యతో బాధ పడాలా అనే అపోహాను తీసువేయాలంటున్నారు నిపుణులు. కొన్ని అంశాలను కంట్రోల్‌ చేయడంతో దీనిని సరిదిద్దవచ్చు. అయితే టైప్‌–2 డయాబెటిస్‌కు చికిత్స లేకున్నా కొంతమందికి దానిని రివర్స్‌ చేయడం సాధ్యమైందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహార మార్పులు, బరువు తè గ్గడం, వ్యాయామం చేయడం ద్వారా మందులు లేకుండానే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేయవచ్చు.

షుగర్‌ ఉన్న వాళ్లు ప్యాట్‌ ఎంతైనా తీసుకోవచ్చా?

టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్న వారు బరువును కాపాడుకోవడం కష్టమే. అలాంటి వారు బరువు పెరగాలంటే ప్యాట్‌ తీసుకోవచ్చని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పని పోషకాహార నిపుణులు అంటున్నారు. షుగర్‌ ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వు పదార్థాలు తినడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగి గుండె పోటు, స్ట్రోక్‌ వచ్చే ఆస్కారం ఉంటుంది.

మందులు తీసుకుంటే స్వీట్స్‌ తినొచ్చా?

మెడిసిన్‌ తీసుకున్నా ఇది అప్లై అవుతుంది కాబట్టి.. డయాబెటిస్‌ ఉన్న వాళ్లు చక్కెర తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటూ మందులు తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -