PM Modi: జమిలి ఎన్నికల విషయంలో మోదీ మాస్టర్ ప్లాన్.. గెలవడం కోసం అలాంటి రిస్క్ చేస్తున్నాడా?

PM Modi: కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే జెమిలి ఎన్నికలను నిర్వహించడం వల్ల ఎన్నికల నిర్వహణలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండకపోవడమే కాకుండా ఖర్చు కూడా భారీ స్థాయిలో తగ్గుతుంది అనేది మోడీ ఆలోచన ఇక ఈ క్రమంలోనే ఈ ఎన్నికల గురించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ అలాగే కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే పలువురు పార్టీలతో సమావేశం అయ్యి ఈ ఎన్నికలు నిర్వహించడం వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి చర్చించి ఎన్నికలు సాధ్యం కాదంటూ తేల్చేశారు.

ఈ విధంగా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం ఏమాత్రం కుదరదు అంటూ ఎన్నికల శాఖ తెలియజేసినప్పటికీ మోడీ మాత్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ ఎన్నికలు జరిగేలాగే అడుగుల ముందుకు వేస్తున్నారు అయితే మోడీ ఈ విధంగా జెమిలి ఎన్నికలపై ఆసక్తి చూపడానికి కారణం ఏంటి అన్న ఆలోచనలు అందరూ ఉన్నారు. ఇక ఈయనపైకి ఖర్చులు తగ్గుతాయి, సమయం వృధా కాదు అంటూ కలర్ ఇచ్చినప్పటికీ ఈ ఎన్నికల నిర్వహణలో మరో కోణం ఉందని తెలుస్తుంది.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పలు రాష్ట్రాలలో బీజేపీకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రధానిగా ఉన్నటువంటి మోడీ వచ్చే ఎన్నికలలో తాను గెలుస్తానా లేదా అన్న అనుమానం కూడా తనలో ఎక్కడో మొదలైంది అందుకే ఈ ఎన్నికలను అమలులోకి తీసుకురావాలని పట్టుబట్టారు. పలు రాష్ట్రాలలో ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగితే చాలామంది పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బిజెపికి ఓటు వేయడంతో అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీకే ఓటు వేస్తారు.

ఇలా ఈ ఎన్నికలు జరగడం వల్ల పలు రాష్ట్రాలలో కూడా తమ ప్రభుత్వం మంచి గ్రిప్ సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనలోనే మోడీ ఈ ఎన్నికలను నిర్వహించాలని పట్టుబట్టారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలలో కూడా బిజెపి ప్రభుత్వం పట్టు సాధించడం కోసమే మోడీ సర్కార్ ఈ విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -