Nitish Kumar: నితీష్ కు మొదలైన చిక్కులు.. ఆపరేషన్ మొదలుపెట్టిన బీజేపీ

Nitish Kumar: తమకు అనుకూలంగా ఉంటే ఓకే.. తోక జాడించారా? కట్ చేస్తాం.. ఇబ్బందులకు గురి చేస్తాం. ఎలాగైనా ఇరుకున పెడుతాం. ప్రభుత్వాన్ని పడగొడతాం. ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తాం అవసరమైతే జైలుకైనా పంపుతాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు పరోక్షంగా ఇచ్చే వార్నింగ్ ఇదే. మోదీ-అమిత్ షా బీజేపీని తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత తమ ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న ఫార్ములా ఇదే. ప్రతిపక్షాలను దెబ్బకొట్టేందుకు ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రం కూడా ఇదే. అనేక రాష్ట్రాల్లో ఇలాంటి వ్యూహన్నే అనుసరించారు. ఇటీవల మహారాష్ట్ర, ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించేందుకు ఇదే సూత్రాన్ని పాటిస్తున్న విషయం అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే.

బీజేపీని ఎదురిస్తున్న కేసీఆర్ పై కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు చేసిన విధానాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక ఇటీవల ఎన్డీయే నుంచి బయటకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ఇప్పుడు బీజేపీ టార్గెట్ పెట్టింది. బీహార్ లో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ కుమార్.. ఇటీవలే ఎన్టీయే నుంచి తప్పుకున్నారు. ఆర్జేడీతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు.

అయితే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లి దేశంలోని ప్రతిపక్షాలను మోదీకి వ్యతిరేకంగా ఏకం చేస్తానంటూ నితీష్ కుమార్ ప్రకటించారు. దీంతో నితీష్ ను ఇబ్బందులకు గురి చేసే పనిని బీజేపీ స్టార్ట్ చేసింది. తాజాగా మణిపూర్ లో నితీష్ పార్టీ అయిన జేడీయూకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ 38 నియెజకవర్గాల్లో పోటీ చేసి ఏడు సీట్లను సంపాదించుకుంది. అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

దీంతో జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనానికి మణిపూర్ స్పీకర్ ఆమోదం తెలిపారు. జేడీయూకి మూడింట రెండు వంతుల మంది బీజేపీలో చేరడంతో ఆ పార్టీలో ఎమ్మెల్యేలను విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై జేడీయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ఎమ్మెల్యేలను డబ్బులు వెదజెల్లి బీజేపీ కొనుగోలు చేసిందని నితీష్ కుమార్ ఆరోపిస్తున్నారు. తాను ఎన్డీయే నుంచి బయటకు రావడంతో తమ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్ర విమర్శలు కురిపించారు.

ప్రస్తుతం మణిపూర్ లో బీజేపీ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ 5, పీపుల్స్ ఫ్రంట్ 5, నేషనల్ పీపుల్స్ పార్టీ 7, కుకి పీపుల్స్ అయన్స్ 2, ఇండిపెండెంట్లు 3 స్థానాలను దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకుని ఆ పార్టీలో విలీనం కావడంతో బీజేపీ బలం మరింత పెరిగింది. 5గురు ఎమ్మెల్యేల చేరికతో బీజేపీ బలం 37కి చేరుకుంది.

అయితే బీహార్ లో నితీష్ ను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తుందని అనుకున్నారు. అలాగే జార్ఖండ్ లో కూడా జేడీయూ బలంగా ఉంది. అయితే బీహార్, జార్ఖండ్ లను వదిలేసి మణిపూర్ పై బీజేపీ దృష్టి పెట్టింది. మణిపూర్, జార్ఖండ్ లో జేడీయను దెబ్బతీసిన తర్వాత బీహార్ లో ఇరుకున పెడతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు కూడా ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. దేశం మొత్తం తిరిగి ప్రతిపక్షాలను ఒకే గోడుకు కిందకు తీసుకొచ్చారు.

చివరికి టీడీపీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ తో కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. దీంతో రాష్ట్రంలో పరోక్షంగా వైసీపీకి సపోర్ట్ చేసి చంద్రబాబును బీజేపీ ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబుపై అనుసరించిన వ్యూహాన్నే నితీష్ కుమార్ పై మోదీ-అమిత్ షా అమలు చేయనున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -