Bandi Sanjay: బండి సంజయ్ కు పోలీస్ కమిషనర్ సవాల్.. ఏం జరిగిందంటే?

Bandi Sanjay:మెడికల్ విద్యార్థి ర్యాంగింగ్ కేసు కానీ, పదో తరగతి పేపర్ లీకేజీ కేసు కానీ వరంగల్ ప్రాంతంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ రెండు కేసులను వరంగల్ సీపీగా ఉన్న రంగనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనే బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సీపీకి కోపమెుచ్చింది. తనపై చేసిన ఆరోపణలపై బండి సంజయ్ ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు.

తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సీపీ ఛాలెంజ్ చేశారు. తాను సెటిల్మెంట్లు చేసినట్టుగా బండి సంజయ్ నిరూపిస్తే తక్షణమే ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతానని సీపీ తెలిపారు. బండి సంజయ్ అనేక ఆరోపణలు చేశారని కానీ తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసునని సీపీ రంగనాథ్ తెలిపారు. తాను గతంలో పని చేసిన ఖమ్మం, నల్గొండలో ఉన్న బీజేపీ వాళ్లను అడిగి తెలుసుకోవచ్చన్నారు. పోలీసులపై బండి సంజయ్ ఆరోపణలు చేస్తుంటారని కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కొందరికి బాధ కలగొచ్చని రంగనాథ్ పేర్కొన్నారు.

గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. రఘునందన్ కాల్ డేటా విషయంలో కొన్ని తెలుసుకోవాలి. దర్యాప్తును రాజకీయ కోణంలో చూడకూడదు. బండి సంజయ్‌తో నాకేమైనా గట్టు పంచాయతీ ఉందా. బండి సంజయ్ ఫోన్ మా దగ్గరికి రాలేదు. రాత్రి 1.14 గంటలకు లాస్ట్ కాల్ ఉంది. బండి లాస్ట్ లొకేషన్ బెజ్జంకి అని చూపిస్తుంది. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. పరువు నష్టం దావా వేసుకోవచ్చు. నేను మాత్రం పరువు నష్టం దావా వేయను. కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తామని వరంగల్ సీపీ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -