KCR: వామ్మో.. కేసీఆర్ పై ఇంత ప్రేమా.. బండి హడావిడి మామూలుగా లేదుగా!

KCR: సాధారణంగా ఒక రాష్ట్రంలో పార్టీల మధ్య తీవ్రమైన వైరం పోటీ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి మధ్య కూడా ఇలాంటి వైరమే ఉంది. తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీని ఎప్పటికప్పుడు అణచి వేస్తూ బిఆర్ఎస్ వేస్తున్న వ్యూహాలు ఫలిస్తున్నాయని చెప్పాలి.ఈ క్రమంలోనే బిజెపిపై బిఆర్ఎస్ ప్రభుత్వం పై చేయి సాధించిందని చెప్పాలి.

ఇక తాజాగా జరిగిన పరిణామాలు బిజెపికి తీవ్ర నష్టాన్ని కూడా కలిగించాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడంపై బీజేపీ ప్రభుత్వం హస్తం ఉంది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే బిజెపి నేత బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే.ఇక ఈ వ్యవహారం తెలంగాణలో తీవ్రస్థాయిలో దుమారం రేపింది.

ఇక ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో అరెస్ట్ అయిన బండి సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. హైదరాబాదులో తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిన విషయం మనకు తెలిసిందే. అయితే బిఆర్ఎస్ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వేడుకకు డుమ్మా కొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి బండి సంజయ్ తాజాగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో బిజెపి నేతలుసీఎం కేసీఆర్ నేటి షెడ్యూల్ బయట పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తాను కూడా ఎంతో ఎదురు చూశానని ఆయనను సన్మానించడం కోసం సాలువ కూడా తీసుకువచ్చానని ఈ సందర్భంగా బండి సంజయ్ చెప్పడంతో పలువురు కెసిఆర్ పై సంజయ్ కు ఎంత ప్రేమో అంటూ కామెంట్లో చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -