YS Vijayamma: జగన్ తల్లి విజయమ్మ విదేశాలకు వెళ్తున్నారా.. రాజకీయాల్లో జోక్యం ఇష్టం లేదా?

YS Vijayamma: ఈసారి ఏపీ రాజకీయాలు రాజధాని అంశం చుట్టూ జరుగుతుందని చాలామంది భావించారు. కానీ, మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. షర్మిల ఏపీలో ఎంటర్ అయిన తర్వాత వివేకాహత్య కేసు ప్రస్తావన తీసుకొని వచ్చారు. కొన్నాళ్లు షర్మిల చుట్టూ ఏపీ రాజకీయాలు నడిచినా.. తర్వాత మళ్లీ డైవర్ట్ అయ్యాయి. కానీ, కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత.. మరీ ముఖ్యంగా షర్మిల కడప నుంచి పోటీ చేస్తారనే ప్రకటన వచ్చిన తర్వాత ఏపీ పాలిటిక్స్ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. వివేకాహత్య కేసునే ఆమె ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. ఆమెకు తోడు సునీత కూడా ఉండటంతో ఏపీ రాజకీయాలు వివేకాహత్య కేసు కేంద్రంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ రాజకీయాలు మాత్రం వివేకాహత్య కేంద్రంగా నడుస్తున్నాయి. అలా చేయడంలో షర్మిల, సునీత సక్సెస్ అయ్యారు. దీంతో.. సీఎం జగన్ తల్లి విజయమ్మ ఎటు వైపు ఉంటారనే ప్రశ్నలు వినిపించాయి. గత కొంతకాలంగా విజయమ్మ షర్మితోనే ఉంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఆమె షర్మిలకు సపోర్టు చేయకపోయినా.. జగన్ కు మాత్రం సపోర్టు చేసే ప్రసక్తే లేదని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఆమె రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి వెళ్లారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తల్లి విజయలక్ష్మి మద్దతు జగన్‌కు ఉన్నట్లేనా అని చర్చించుకున్నారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే ఆమె మరో షాక్ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపుల పాయకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి వచ్చారు. కుమార్తె షర్మిలను కూడా ఆశీర్వదించారు. అంటే.. అటు కుమారుడికి.. ఇటు కుమార్తెకు కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు. తన ఇద్దలు బిడ్డలు రెండు కళ్ల లాంటి వారని.. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు విజయమ్మ ప్రకటించారు. ఇద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని అది దైవ సంకల్పమని సర్ది చెప్పుకున్నారు. తాను కుమార్తెకు అండగా ఉండటానికి రాజీనామా చేశానన్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. షర్మిల కూడా ఏపీకి వచ్చారు. జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అంటే రెండు కళ్లలో ఒక కంటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితిలో విజయమ్మ పడిపోయారు. ఎవర్నీ వదులుకోలేకపోతున్నారు. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్తున్నారు.

జగన్ వైపు ఉండటానికి విజయమ్మ కూడా ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే జగన్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానంగా పేరు వినిపిస్తున్న అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చారు. వివేకాను చంపింది అవినాషేనని.. షర్మిల గట్టిగా ఆరోపిస్తున్నారు. తన ఎంపీ టిక్కెట్ కోసం పోరాడినందునే ఆయనను చంపేశారని షర్మిల బాధపడుతున్నారు. అందుకే సునీత కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నారు. అవినాష్ రెడ్డికి జగన్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడుతున్నందున.. షర్మిల విరుచుకుపడుతున్నారు. అంతేకాదు.. వివేకానంద రెడ్డిని హత్య చేయించింది అవినాష్ రెడ్డేనని చెబుతూనే… కావాలంటే తన తల్లి విజయమ్మను కూడా అడగొచ్చని చెబుతున్నారు. దీంతో.. జగన్ ఇరకాటంలో పడుతున్నారు. ఏ క్షణం ఏమైనా జరగొచ్చనే భయంలో జగన్ ఉన్నారు. విజయమ్మ పొరపాటు షర్మలతో ప్రచారానికి వెళ్తే ప్రమాదమని భావించిన జగన్.. తన తల్లిని ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ విదేశీ పర్యటనకు పంపించాలని చూస్తున్నారట. మరి విజయమ్మ వెళ్తారా? ఒకవేళ వెళ్లినంత మాత్రాన జగన్ కు జరగాల్సిన నష్టం జరగకుండా ఉంటుందా?

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -