Pooja Hegde: బాడీలో ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకోనున్న బుట్ట బొమ్మ.. ఎందుకో తెలుసా?

Pooja Hegde: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే కి వరుస సినిమా అవకాశాలతో పాటుగా వరుస ఫ్లాప్ లు కూడా వెంటాడుతున్నాయి. అయితే పూజ హెగ్డే కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక పూజ హెగ్డే నటించిన ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఈమె పై నెగిటివ్ ప్రచారం ఎక్కువయింది.

ఐరన్ లెగ్ అంటూ ఆమెను ట్రోలింగ్స్ చేస్తున్నారు. అలాగే పూజ హెగ్డే బాడీ విషయంలో కూడా నెగిటివ్ గా కామెంట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా చాలామంది పూజా హెగ్డే ముక్కు విషయంలో నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుండడంతో ఆ విషయంలో పూజా కాస్త హర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా పూజ హెగ్డే కూడా తన ముక్కుని అందంగా మార్చుకోవాలి అనుకుందట. ఇది ఇలా ఉంటే తాజాగా పూజ హెగ్డే కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే పూజ హెగ్డే తన ముక్కుకి సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటోందట.

అయితే ఈ విషయం అధికంగా బయటికి రాకపోయినా కూడా ఇదే విషయం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినీ వర్గాలను కూడా చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలపై బుట్ట బొమ్మ పూజా హెగ్డే విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం పూజ హెగ్డే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. వరుసగా మూడు ఫ్లాప్ లను చవి చూసిన పూజా హెగ్డే కు తన తదుపరి సినిమాలో అయినా మంచి సక్సెస్ను తెచ్చిపెడతాయో లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -