Hanuman: హనుమాన్ మూవీకి పాజిటివ్ టాక్.. ఆ డొక్కు థియేటర్లకు కాసుల వర్షమంటూ?

Hanuman: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ సినిమా పేరు మారుమోగిపోతోంది. ఈ సినిమా విడుదలకు ముందు చాలామంది ఈ సినిమా చిన్న సినిమా పెద్దగా థియేటర్లలో ఆడదు. ఒక వారం రోజుల్లోనే ఓటీటీ లోకి వస్తుంది అంటూ చాలా నెగిటివ్ గా మాట్లాడారు. విడుదలకు ముందు అన్నింటికంటే చిన్న సినిమాగా కొందరు అభివర్ణించిన హనుమాన్ ఏకంగా సంక్రాంతి విజేతగా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. దీంతో అభిమానులు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

 

దానికి తోడు ఫెస్టివల్ సమయం కావడంతో థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు గుంటూరు కారం సైంధవ్ సినిమాలకు మిక్స్డ్ టాక్ రావడంతో హనుమాన్ టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ లో రెండు మూడు టికెట్లు ఒకే థియేటర్లో కావాలంటే దొరికే పరిస్థితి ఎంత మాత్రం లేదు. సదరు మేనేజర్లు, ఓనర్లకు ఫోన్లు చేసినా లాభం ఉండటం లేదు. బుక్ మై షో లో సగటు గంటకు 25 వేల హనుమాన్ టికెట్లు అమ్ముడుపోతుండగా గుంటూరు కారం 10 వేల లోపే పరిమితం కావడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇదేదో డిస్ట్రిబ్యూటర్లు చెప్పే సమాచారం కాదు. యాప్ ఎవరు ఓపెన్ చేసి చూసినా ఫిగర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అటుఇటుగా జనవరి 16 దాకా ఏ మెయిన్ సెంటర్లో అంత సులభంగా టికెట్లు దొరికే సీన్ కనిపించడం లేదు. ఏపీ లో స్క్రీన్లు పెంచినా దానికి అనుగుణంగా అంతకంటే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. జనాలు ఇష్టపడని కొన్ని డబ్బా థియేటర్లు సైతం హనుమాన్ పుణ్యమా అంటూ కళకళలాడుతున్నాయి. హనుమాన్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 22 కోట్ల దాకా వచ్చినట్టు సమాచారం. ఇందులో ప్రీమియర్ షోల కౌంట్ కూడా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -