Pawan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగవేరాయాల్సిందే.. పవన్ కు సొంతమైన ఈ అద్భుతమైన రికార్డ్ తెలుసా?

Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సినిమాలలో బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇది వలె పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన క్రేజ్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వేరేల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ గర్వంగా ఫీల్ అవుతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వార్త ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.. మామూలుగా సెలబ్రిటీలపై ఉన్న అభిమానంతో వారి ఫోటోలను గీయడం అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అభిమానులు ఆ సెలబ్రిటీ ఫోటోలను వారికి బహుమతులుగా కూడా ఇస్తూ ఉంటారు. వాటిని ఫ్రేమ్స్ కట్టించి హీరోలకు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. ఇంకొంతమంది అటువంటి పెయింటింగ్స్ ని అభిమానులకు అమ్ముతూ ఉంటారు.

 

అయితే అటువంటి ఫ్రేమ్ లు మహా అంటే వెయ్యి 2000 లేదా 10,000 మించి ఉండవు అని చెప్పవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ డ్రాయింగ్ ఫొటో అక్షరాలా 520 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 43,241 రూపాయలు. అవును ఇప్పటి వరకు ఏ హీరో క్రియేట్ చేయలేని రికార్డు ఇది. బ్రో సినిమాలో పవన్ లుక్ ను చేత్తో గీసిన ఈ ఆర్ట్ ను అమెరికాలో ఉంటున్న ఒక పవన్ అభిమాని 520 డాలర్లు పెట్టి కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు అది రా పవన్ రేంజ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -