Salaar: సలార్ సినిమా రిజల్ట్ మీద ప్రభాస్ కు నమ్మకం లేదా.. ప్రశాంత్ నీల్ కూడా ఈ హీరోని ముంచేస్తారా?

Salaar:  టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ త్వరలోనే విడుదల కానుంది. డిసెంబర్ ఆఖరిలో ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఒక కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నెట్టింట వేరే రకంగా వార్తలు వినిపిస్తున్నాయి. కెజిఎఫ్ సిరీస్, కాంతారా లాంటి సినిమాలు తక్కువ కమిషన్ మీద అస్సలు పెద్దగా అడ్వాన్స్ లు కూడా తీసుకోకుండా నేరుగా విడుదల చేసుకుని, లాభాలు తిన్న నిర్మాతలు ఇప్పుడు సలార్ ను ఎలాగైనా నాన్ రిటర్న్ అడ్వాన్స్ ల మీద అమ్మేయాలని అనుకుంటున్నారు. ఆంధ్ర నుంచి 100 కోట్లు వస్తాయని అంచనా వేసిన వాళ్లు, అలా రాకుంటే 75 కు ఎందుకు తగ్గిపోతున్నారు? రేటు తగ్గుతున్నా కూడా బయ్యర్లు ఎందుకు ధైర్యంగా ముందుకు రావడం లేదు.

ఇది రెండో రకం డిస్కషన్. ఇదిలా వుంటే కొన్ని గ్యాసిప్ లు కూడా సలార్ పై వినిపిస్తున్నాయి. హీరో ప్రభాస్ ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు, నిర్మాతలకు మధ్య పొరపొచ్చాలు వచ్చాయన్నది ఆ గుసగుసల సారాంశం. సినిమా కంటెంట్ క్వాలిటీ మీద ప్రభాస్ సంతృప్తిగా లేరని సమాచారం. అలాగే విడుదల డేట్ పై కూడా అయిష్టంగా ఉన్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో సరైన డేట్ కాదని ప్రభాస్ చెప్పినా నిర్మాతలు అంగీకరించలేదని తెలుస్తోంది.

దాంతో ప్రభాస్ సైలంట్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. సలార్ టీమ్ సినిమా కంటెంట్ ఏమీ వదలడం లేదు. సినిమా విడుదల మరో ఏడు వారాల్లో వుంది. మరి రెండు రెండు మూడు వారాల తరువాత ప్రచారం మొదలుపెడతారేమో తెలియదు. ప్రభాస్ కనుక ప్రచారంలో పాల్గొనకుంటే మాత్రం సినిమా మీద వినిపిస్తున్న గ్యాసిప్ లు అన్నీ నిజమనే అనుకోవాల్సి వస్తుంది. మరి ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ సమయానికి వస్తారో రారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -