Prabhas: అలా జరిగితే ప్రభాస్ కు గిన్నీస్ రికార్డ్ గ్యారంటీ.. ఫ్యాన్స్ గ్రేట్ కదా!

Prabhas: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రభాస్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. మొత్తానికి ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో హడావిడి చేస్తున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు తన సొంతం చేసుకొని, మొన్నటి వరకు షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇదంతా పక్కన పెడితే ఏ స్టార్ హీరో అభిమానులైన తమ హీరో సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున కటౌట్ లు ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేయకపోతే సదరు స్టార్ హీరో అభిమానులకు ఆ సినిమా పూర్తిగా వంటపట్టదు. కాబట్టి భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున హడావిడి చేసి థియేటర్లోకి అభిమానులు అడుగు పెడతారు.

ఇదేవిధంగా ప్రతి స్టార్ హీరో అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేస్తూ తమ హీరో అభిమానాన్ని ఆ విధంగా చాటుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ అభిమానులు ఎలాగైనా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాదులో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలపాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా ఒక భారీ ఎత్తు కటౌట్ ను ఏర్పాటు చేయాలని, అది గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట.

ఇందుకోసం హైదరాబాదు ప్రభాస్ అభిమానులు డబ్బు విషయంలో ఏమాత్రం తగ్గుకుండా కటౌట్ నిర్మాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఖర్చు ఎంతైనా సరే కటౌట్ మాత్రం అదిరిపోయేలా ఉండాలని ఫిక్స్ అయ్యారట. తమ హీరో తాజాగా విడుదలైన ఆది పురుష్ పోస్టర్ ను భారీ ఎత్తున కటౌట్ చేయాలని అనుకుంటున్నారు. నిజంగా పెద్ద ఎత్తున కటౌట్ ఏర్పాటు చేస్తే ప్రభాస్ అభిమానులకు గిన్నిస్ రికార్డు గ్యారెంటీగా తగ్గుతుంది. ఫ్యాన్స్ చాలా గ్రేట్ కదా అని ఈ విషయం తెలిసిన కొందరు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -