Yatra 2: యాత్ర2 కోసం ప్రభాస్ ఫ్రెండ్స్ రిస్క్.. తప్పు చేస్తున్నారంటూ?

Yatra 2: ఏపీలో కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న విషయం ఎట్టకేలకు నిజమయింది. 2019కు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ, ఆయన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాను ఎన్నికల అస్త్రంగా వాడుకున్న వైసీపీ ఈసారి జగన్ సినిమాను తెరపైకి తీసుకురాబోతోంది. ఆయనకు అధికారం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన పాదయాత్ర ఆధారంగా యాత్ర-2 సినిమా రాబోతోంది. యాత్ర సినిమాను రూపొందించిన దర్శకుడు మహి. వి. రాఘవ నే ఈ యాత్ర 2 సినిమాను కూడా రూపొందిస్తున్నారు. తమిళ నటుడు జీవా ఇందులో జగన్ పాత్ర తెలుస్తోంది.

అలాగే కొన్ని సన్నివేశాల్లో వైఎస్‌గా మమ్ముట్టినే కనిపించబోతున్నాడని అంటున్నారు. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో జగన్ మీద సినిమా తీయడం కరెక్టేనా, యాత్ర మూవీని రిసీవ్ చేసుకున్నట్లే దీన్ని కూడా ప్రేక్షకులు, జనాలు తీసుకుంటారా అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ సినిమాను యువి క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థ ప్రభాస్ ఆప్త మిత్రులైన వంశీ, ప్రమోద్‌, విక్కీలది అన్న సంగతి తెలిసిందే. యువి ని ప్రభాస్ సొంత సంస్థ లాగే చూస్తారు. ఏపీ సీఎం జగన్‌తో ప్రభాస్ మిత్రులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.

 

వారిదీ జగన్ సామాజిక వర్గమే. కానీ వీరి బంధం గురించి ఇప్పటి వరకు బయటికి వెల్లడి కాలేదు. సినీ పరిశ్రమలో ఇలాంటి రాజకీయ బంధాలు బయట పడటం మంచిది కాదన్న ఉద్దేశంతో ఓపెన్ కారు.
ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు మారతాయో తెలియదు కాబట్టి ఇలా ఒక పార్టీ రంగు పూసుకుంటే కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే తెర వెనుక ఎలాంటి బంధం ఉన్నా పైకి న్యూట్రల్‌గా కనిపించడానికి చూస్తారు. నిర్మాతలకు అయితే ఇది మరీ అవసరం. కానీ యువి వాళ్లు ఇప్పుడు యాత్ర-2 సినిమాను నిర్మించడం ద్వారా వైసీపీ రంగును పులిమేసుకుంటున్నట్లే చెప్పాలి. ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు ఎలా తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -