Prabhas: ఆ పేరుతో పిలిస్తే స్టార్ హీరో ప్రభాస్ కు చెడ్డ చిరాకు. ఆ పేరును అసహ్యించుకుంటారా?

Prabhas:  పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈయన మోకాలు సర్జరీ కావడంతో విదేశాలలో ఉన్న విషయం మనకు తెలిసిన దాదాపు నెలరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రభాస్ తిరిగి ఇండియా రానున్నారు.

ఇలా స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ప్రభాస్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో చాలామంది హీరోలను వారి ముద్దు పేరులతో మనం పిలుస్తున్నాము అయితే ప్రభాస్ కి ఇలా పెట్ నేమ్స్ తో పిలిస్తే ఏమాత్రం నచ్చదట. ప్రభాస్ ను చిన్నప్పటి నుంచి తన స్నేహితులు ఉప్పు అనే పెట్ నేమ్ తో పిలిచేవారని అయితే తనకు అలా పిలవడం ఏ మాత్రం నచ్చేది కాదని తెలుస్తుంది.

ప్రభాస్ ఇంటిపేరు ఉప్పలపాటి కావడంతో తన స్నేహితులందరూ కూడా తనని సరదాగా ఆట పట్టించడం కోసం ఉప్పు అని పిలిచేవారట అయితే ఆయనకు మాత్రం ఆ పేరు అంటే చెడ్డ చిరాకు అలాగే మరికొందరు తనని పప్పు అనే పేరుతో కూడా పిలుస్తారట ఈ రెండు పేర్లతో కనుక ఎవరైనా ప్రభాస్ ని పిలిస్తే తనకు చాలా కోపం వస్తుందని ఓ సందర్భంగా వెల్లడించారు. అయితే ఈ విషయం తెలిసినటువంటి అనుష్క ఎప్పుడు కూడా తనని ఆటపట్టించడానికి ఉప్పు పప్పు అంటూ పిలిచేవారని తెలుస్తుంది.

ఇక తనకు తన పూర్తి పేరు ప్రభాస్ అని పిలిస్తే ఇష్టపడతారట అయితే చాలామంది ఆయనని డార్లింగ్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇక తన ప్రాణ మిత్రుడు అయినటువంటి గోపీచంద్ మాత్రం ప్రభాస్ ఇస్తా ఇష్టాలను గౌరవిస్తూ తనని ఎప్పుడూ కూడా ప్రభాస్ అనే గౌరవంగా పిలుస్తారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ డిసెంబర్ 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -