Prabhas: ప్రభాస్ ప్లానింగ్ విషయంలో తడబడుతున్నారా.. ఏం జరిగిందంటే?

Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ప్రభాస్ ఈ సినిమా తర్వాత ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇకపోతే ప్రభాస్ అన్ని ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కి సలార్ వంటి సినిమాలతో పాటు మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఇలాంటి జానర్లోనే ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలన్నీ కూడా యాక్షన్ జానర్ లో ఉండటంతో ఈయన గాలి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలపై పడిందని తెలుస్తోంది. ప్రభాస్ ను తాజాగా ఓ నిర్మాత కలిసి సినిమా గురించి చర్చలు మొదలుపెట్టగా..ప్రభాస్ మాట్లాడుతూ ఏదైనా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథ ఉంటే చెప్పండి చేద్దామని తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారట.

 

ఇలా ప్రభాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేద్దామని చెప్పడంతో సదరు నిర్మాత సైతం అలాంటి కథలను ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా యాక్షన్ సినిమాలు కావడంతో ఆయనకు ఆ సినిమాలు బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది అందుకే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేయాలని ఆలోచనలు ఉన్నారని ప్రభాస్ మాటలు బట్టి చూస్తేనే అర్థమవుతుంది.

 

ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాల తర్వాత ఆ తరహా ఫ్యామిలీ కథ చిత్రాలలో నటించలేదు. అందుకే ఇలా ఫ్యామిలీ సినిమాలో నటించాలన్న కోరిక ఆయనలో కలిగిందని అందుకే నిర్మాతల దగ్గర తన మనసులో కోరికను బయటపెట్టారని తెలుస్తోంది.ప్రభాస్ ఇలా తన కోరికను చెప్పడంతో అభిమానులు కథల ఎంపిక విషయంలో ప్రభాస్ ఏమైనా తడబడుతున్నారా అందుకే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని కోరుకుంటున్నారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -