Prabhas: ప్రభాస్ పరువు గంగలో కలవడానికి రీజన్ వాళ్లేనా.. ఇంతలా మోసం చేస్తున్నారా?

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం పానీ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు ఒక సినిమాకి 50 కోట్లు బడ్జెట్ కేటాయించాలి అంటే వామ్మో అని నిర్మాతలు ఇప్పుడు ఒక్కో సినిమాకు 500 కోట్ల బడ్జెట్ కూడా పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇలా నిర్మాతలలో ఇంత ధైర్యం రావడానికి కారణం బాహుబలి సినిమానే చెప్పాలి. స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు కూడా దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కాయి. అయితే ఈ మూడు సినిమాలు కూడా పెద్దగా మంచి సక్సెస్ కాకపోవడంతో నిర్మాతలు కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. ఇక ప్రభాస్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు తక్కువ బడ్జెట్ తో సినిమా పూర్తి అయినప్పటికీ అనవసరమైనటువంటి హంగులు జోడించి బడ్జెట్ పెంచేస్తున్నారు.

ఇలా బడ్జెట్ పెరిగిన కారణంగా సినిమాలను కూడా భారీరేట్లకు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రభాస్ పై ఉన్న నమ్మకంతో బయ్యర్లు భారీ ధరలకు సినిమాని కొనుగోలు చేసిన ఒకవేళ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇలా ప్రభాస్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు అత్యంత భారీ ధరలకు సినిమా అమ్మటం వల్లే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కాస్త ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పాలి.

కేవలం నిర్మాతల కారణంగానే ప్రభాస్ సినిమాలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. తాతగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఈ సినిమాకు తక్కువ బడ్జెట్ అయినప్పటికీ నిర్మాతలు మాత్రం భారీగా మార్కెట్ జరిపి ఎక్కువ సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దీంతో భారీ ధరలకు సినిమాని మార్కెట్లోకి తీసుకురావడంతో కొనడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు దీంతో ఈ సినిమా ఇంకా ఓవరాల్ బిజినెస్ క్లోజ్ కాలేదు. అందుకు కారణం నిర్మాతలు ఈ సినిమా విషయంలో కొండేక్కి కూర్చోవడమే కారణమని నిర్మాతల కారణంగానే ప్రభాస్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతుందని స్పష్టంగా అర్థం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -