Prabhas: స్టార్ హీరో ప్రభాస్ మూవీ సలార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన సలార్ సినిమా థియేటర్ల వద్ద రికార్డుల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే. కిందటి సంవత్సరం 2023 డిసెంబర్ 22న విడుదలైన సలార్ సినిమా ఉన్న రికార్డ్లు అన్నిటిని లేపుకుంటూ పోయింది. పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ప్రభాస్ కి ఒక మంచి కం బ్యాక్ ఫిలిం గా అయ్యింది.

 

ఈ సినిమాలో ప్రభాస్ని చూపించిన విధానం కాని ఆ స్టైల్ కానీ స్క్రీన్ మీద విజిల్స్ వర్షం కురిపించాయి. కేజీఎఫ్ డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ప్రభాస్ తో సరైన రీతిలో దర్శకించడంతో మా హీరో ని ఇలాగే చూడాలనుకుంటున్నాము అలాగే చూపించారు అని ప్రభాస్ అభిమానులందరూ ప్రశాంత్ నీల్ కి గుడి కట్టే రీతిలో ప్రశంసిస్తున్నారు. సలార్ సినిమా ధియేటర్లో 750 కోట్లకు పైగా వసూలు చేసింది.

బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్ ద ఇయర్ ఇన్ 2023గా నిలిచింది సలార్ సినిమా. ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీడీలోకి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ కొనుక్కున్నది. నెట్ఫ్లిక్స్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికర విషయం గా నిలిచింది.

 

ఈ సినిమా బాండ్ ప్రకారం విడుదలైన 45 రోజులకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రావాలి. అంటే ఫిబ్రవరి 4న రావాలి. ఒకవేళ ఏమైనా అనివార్య కారణాల వల్ల లేట్ అయినా సరే ఫిబ్రవరి 7లోగా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేస్తుంది. కనుక ఎవరైనా థియేటర్లలో మిస్ అయి ఉంటే కచ్చితంగా ఓటిటిలో అందరూ కలిసి సినిమాని చూడండి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -