Prabhas: భక్త కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Prabhas: భక్తకన్నప్ప.. గత రెండు మూడు రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమూగిపోతోంది. టాలీవుడ్ హీరో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప అనే సినిమా ఇటీవలే మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దానికి తోడు ఈ సినిమాలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండడంతో పాటు ఆ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇందులో ప్రభాస్ పరమేశ్వరుడి పాత్రలో నటించనున్నాడట. ఆ పాత్ర సుమారుగా పది నిమిషాల పాటు ఈ చిత్రంలో ఉంటుందట. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ భక్తకన్నప్ప సినిమా కోసం మాత్రం ప్రభాస్ ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. అందుకు గల కారణం మంచు కుటుంబంతో ఆయనకీ ఉన్న రిలేషన్ అని తెలుస్తోంది. మంచు మోహన్ బాబుతో కలిసి ప్రభాస్ బుజ్జిగాడు అనే చిత్రం చేసాడు. ఇక అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య రిలేషన్ తండ్రి కొడుకుల రేంజ్ లో ఉంటుంది.

మంచు విష్ణు కూడా ప్రభాస్ కి మంచి స్నేహితుడు. అందుకే ఈ సినిమా ఉచితంగా చెయ్యడానికి ఒప్పుకున్నాడట ప్రభాస్. ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఈ సినిమా రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది అనే చెప్పాలి. సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి అంటే ఇక సినిమా విడుదల అయిన తర్వాత ఇలా ఉంటుందో చూడాలి మరి. మరొకవైపు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటించిన సలార్ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -