Adipurush First Look: విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టిన ప్రభాస్ లుక్ మామూలుగా లేదుగా?

Adipurush First Look: టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో అతి తక్కువ సినిమాలో నటించి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు. ఇక ప్రభాస్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో అంచనాలు వేసుకున్నారు.

కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయం సాధించి పెట్టలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో వరుస సినీ అవకాశాలు అందుకుంటూ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు ఆది పురుష్ సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుంది.

ఇక సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైతున్నప్పటికీ ఈ సినిమా విషయంలో ఒక అప్ డేట్ కూడా నిన్నటి వరకు ఇవ్వలేదు. ఇక ఈ సినిమా టీజర్ అయోధ్యలో అక్టోబర్ రెండు న విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం లో తాజాగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో ప్రభాస్ విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టి కనిపించాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు. కాగా ఈ పోస్టర్ ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ప్రస్తుతం మరో స్థాయిలో హడావిడి చేస్తుంది. ఇక రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్.. ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -