Prabhas: ఆదిపురుష్ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్.. అదే కారణమా?

Prabhas:  టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. చేతినిండా సినిమాలతో షూటింగ్ నేపథ్యంలో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. కాగా ఆయన అభిమానులు ఎప్పుడు ఇప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ మూవీ టీజర్ ను ఆదివారం రోజున విడుదల చేశారు.

నిజానికి చెప్పాలంటే ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను, ప్రభాస్ అభిమానులను చాలా వరకు నిరాశ పరిచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ రాముడు పాత్ర చేస్తున్నాడంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతాయి. కానీ నిన్న విడుదలైన టీజర్ లో ప్రభాస్ రాముడు లా ఎక్కడ కూడా కనిపించలేదు. అంతేకాకుండా టీజర్ కూడా ఒక కార్టూన్ టీజర్ లా అనిపించింది. ఈ టీజర్ చూసిన ప్రభాస్ యాంటి అభిమానులు ఈ సినిమాను బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు ఏమాత్రం తీసుకోలేకపోతున్నారు. ఏదేమైనా డైరెక్టర్ ఓం రౌత్ ఆలోచనలు ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా లేవు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ పై శ్రద్ధ చూపెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే టీజర్ లాంచ్ తర్వాత ప్రభాస్ బస చేసిన హోటల్లో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ప్రభాస్ కోపంగా.. ఓం నువ్వు నా రూమ్ కి వస్తున్నావుగా.. రా అంటూ ఎంతో కోపంగా పిలుస్తున్నట్లు కనిపించాడు.

దీనిపై నెటిజన్లు నా నా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. టీజర్ కు వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ ప్రభాస్ ను బాధ పెట్టిందని, ఓం రౌత్ చెప్పిన కథకు ఆది పురుష్ సినిమాకు పొంతన కూడా లేదని ప్రభాస్ నిరాశ చెందాడట. అందుకోసమే ఆయన ఈరకంగా ఆ డైరెక్టర్ పై విరుచుకు పడుతున్నాడు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ పుకార్ల గురించి ప్రభాస్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాల్సి ఉంది. ఏదేమైనా ఆది పురుష్ టీజర్ మాత్రం ప్రభాస్ అభిమానులకు తీరని లోటును మిగిల్చింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: భారత్ క్రికెటర్ కంటే వైసీపీ నేత ముఖ్యమా.. పవన్ కళ్యాణ్ విమర్శలు మామూలుగా లేవుగా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై చాలా ఫోకస్ పెట్టారు అవకాశం దొరికితే చాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
- Advertisement -
- Advertisement -