Jagan-Prashanth Kishor: ఆ ఒక్క మాటతో జగన్ పరువు తీసేసిన ప్రశాంత్ కిషోర్.. అసలేమైందంటే?

Jagan-Prashanth Kishor: ప్రశాంత్ కిశోర్.. సక్సెస్ ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన టేకప్ చేసిన పార్టీల్లో 90శాతం అధికారంలోకి వచ్చాయి. కానీ, ఆయన మాత్రం.. గెలిచే అవకాశం ఉన్న పార్టీలకే తాను పని చేస్తానని తరచూ చెబుతారు. అసలు రూట్ లెవెల్‌లో పార్టీకి బలం లేనపుడు ఎన్ని వ్యూహాలు రచించినా.. గెలవడం కష్టమేనని అంటారు. గెలుపునకు అవకాశాలు ఉన్న పార్టీని మన స్ట్రాటజీలతో కచ్చితంగా విజయతీరాలు చేర్చొచ్చాన పలు సందర్భాల్లో చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ కోసం పనిచేశారు. ఇప్పుడు కూడా ఐపాక్ సంస్థ వైసీపీ కోసం పని చేస్తుంది కానీ.. ప్రశాంత కిశోర్ ఐపాక్ తో తెగదెంపులు చేసుకున్నారు. అంటే.. ఇప్పుడు వైసీపీకి ప్రశాంత్ కిశోర్‌కి వృతిపరంగా ఎలాంటి సంబంధాలు లేవు. కానీ.. ప్రశాంత్ కిశోర్ పలు సందర్భాల్లో జగన్ గురించి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

 

రీసెంట్‌గా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మీడియా సంస్థ నిర్వహించిన ఓ డిబెట్‌లో ఆయన ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ డిబెట్ కండక్ట్ చేసిన మీడియా ప్రతినిధి అనంత్ గోయాంకా పీకేకి ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. దేశంలోని రాజకీయ నాయకులను స్టాక్ మార్కెట్‌లో స్టాక్స్ అనుకుంటే మీరు ఏ స్టాక్ కొంటారు అని అడిగారు. అలా అడుగుతూ పది మంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, ఉదయనిధి స్టాలిన్, అఖిలేష్ యాదవ్, విద్యా ఠాక్రే, రాజ్ పాశ్వాన్, రాఘవ్ చద్దా, ఉమర్ అబ్దుల్లా, అభిషేక్ బెనర్జీ.. ఈ పది మందిలో ఐదుగురిని సెలక్ట్ చేసుకోవాలని అనంత్ గోయాంకా పీకేని అడిగారు. అయితే.. పీకే ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు. వీరంతా.. కుండీలో పెంచుకునే మొక్కలు లాంటివారని అన్నారు. అంటే.. వీరంతా రాజకీయ వారసులు తండ్రి పేరుతో రాజకీయాలు చేస్తున్నవారు. వారి తండ్రులు వారిని కుండీలో పెట్టి పెంచారు. అయితే.. వారు కుండీలకే పరిమితం అవుతారని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. మార్కెట్‌లో ఈ 10 స్టాక్స్ వెరీ బ్యాడ్ స్టాక్స్. అందులో నన్ను ఒకటి ఎంచుకోవాలంటే ఎలా చెప్పండి అని పీకే తిరిగి ప్రశ్న వేశారు.

ఇందులో స్టాలిన్, జగన్, అభిషేక్ బెనర్జీలతో పీకే పని చేశారు. వారిని విజయ తీరాలకు చేర్చారు కూడా. కానీ వారిపై ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇంకా ఎవరో ఒకరికి లాభం చేసే ఉద్దేశ్యంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారేమో అనుకుంటే.. వీరందరిదీ రాజకీయంగా తలోదారి. వైసీపీ అధినేత జగన్.. బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. అభిషేక్ బెనర్జీ అంటే.. టీఎంసీ.. బీజేపీ కాంగ్రెస్ కు మధ్యేమార్గంగా ఉన్నారు. ఇక ఉదయనిధి స్టాలిన్.. ఇండియా కూటమిలో ఉన్నారు. కాబట్టి మూడు వేరు వేరు దృవాలు కాబట్టి.. పీకే తన అభిప్రాయాన్ని ఎవరి కోసమో చెప్పారని అనుకోలేం.

 

ఇక, ఏపీ సీఎం జగన్ విషయానికి వస్తే పీకే పలు సార్లు ఇలాంటి కామెంట్స్ చేశారు. అనవసరంగా వైసీపీ కోసం పని చేశానని ఓ సారి అన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాల కోసం డబ్బు పప్పూ బెల్లాల్లా పంచేస్తే.. రాష్ట్రం దివాళా తీస్తుందని కూడా మరోసారి అన్నారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ పనితీరును వేలెత్తి చూపించే కామెంట్స్ అని చెప్పకతప్పదు. రీసెంట్ గా పీకే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. జగన్ ను అంతమాట అనేశారేంటీ? అని ట్రోల్ చేస్తున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -