Prashanth Neel: దానికోసమే ప్రభాస్ పై సీరియస్ అయినా ప్రశాంత్ నీల్!

Prashanth Neel:  టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకేక్కించిన బాహుబలి మూవీ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు.

ఏదేమైనా ప్రభాస్ నటుడు గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే కే జి ఎఫ్ ఫేమ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మనందరికీ తెలిసిందే.ఇక ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ వస్తున్న సినిమా సలార్. ఈ సినిమా ఇప్పటికే కొంత వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా మెప్పిస్తుంది.

ఇక ప్రభాస్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ సలార్ తో పాటు మరో మూడు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఆది పురుష్, ప్రాజెక్టు K, స్పిరిట్ అనే సినిమాలతో ప్రస్తుతం షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడట. ఇక ప్రభాస్ షెడ్యూల్ ని బట్టి సలార్ షూటింగ్ హాజరవుతున్నట్లు తెలుస్తుంది.

ఇక ప్రభాస్ అలా షూటింగ్ కి వచ్చిన ప్రతిసారి తన లుక్ పూర్తిగా మారిపోతుందట. దీంతో ప్రశాంత్ నీల్ ప్రభాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ ఏం చేయాలో తెలీక.. కొన్ని యాక్షన్స్ సన్నివేశాలలో ప్రభాస్ డూప్ తో పని కానిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ పై ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయం గురించి ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -