Prashanth Varma: పుత్రోత్సాహంతో పొంగిపోయిన ప్రశాంత్ వర్మ తండ్రి.. ఏమైందంటే?

Prashanth Varma:టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్. ఈ సినిమాలో తేజా సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశాంత్ వర్మ అభిమానులు ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 

ఆయనపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంచి గొప్ప సినిమాను తీశారు అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియా వైడ్ ప్రశాంత్ వర్మ పేరు మారుమోగుతోంది. ఇక మరోసారి తెలుగు దర్శకుడు పేరు దేశమంతటా గొప్పగా వినిపిస్తుండడంతో తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పట్ల ప్రేక్షకులే ఇంత సంతోషం వ్యక్తం చేస్తుంటే ప్రశాంత్ వారు మాత్రమే ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ఒక థియేటర్ లో సినిమా చూసి వస్తున్న ఒక వ్యక్తిని మీడియా వారు ప్రశాంత్ వర్మ తండ్రి అని తెలియక సినిమా ఎలా ఉందని రివ్యూ అడిగారు.

ఆ ప్రశ్నకు ఆయన బదులిస్తూ..తీసినోడు నా కొడుకు అంటూ పుత్రోత్సాహంతో చెప్పుకున్నారు. ఆయన మొహంలో సంతోషం వెలిగిపోతోంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో పలువురు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు ఆ వీడియోని తెగ వైరల్ చేస్తూ ప్రశాంత్ వర్మ ని ట్యాగ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -