Prithviraj Sukumaran: ముక్కు పుడ‌క సూట్ కాలేదు.. ఈ విమర్శలను ప్రశాంత్ నీల్ గమనిస్తున్నాడా?

Prithviraj Sukumaran:  బాలీవుడ్ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు బ్రో డాడీ, లూసిఫర్ 2, జనగణమన, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. సినిమాలలో నటిస్తూనే మరొకపక్క సినిమాలకు దర్శకత్వం కూడా చేస్తున్నారు.ఇక ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సాలార్ సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా అక్టోబర్ 16 పృధ్విరాజ్ సుకుమారన్ పుట్టినరోజు కావడంతో కొత్త పాస్టర్ ను రిలీజ్ చేసి బర్త్డే విషెస్ తెలిపారు టీం మెంబెర్స్. మామూలుగా అయితే ఈపాటికి సలార్ రిలీజ్ అయ్యి నెల అయ్యేది. కానీ అనుకోకుండా వచ్చిన డిస్టబెన్స్ వల్ల రిలీజ్ డేట్ మారిపోయింది. ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నారుగా కనిపించనున్నాడు. గత ఏడాది కూడా అతని పుట్టినరోజుకు సేమ్ ఇలాంటి పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

ఇప్పుడు కూడా వరదరాజ మన్నార్ సీరియస్ లుక్ తో యుద్ధానికి సిద్ధమైన వాడిలాగా కనిపిస్తున్నాడు. కానీ అతని లుక్ కి ఆ ముక్కుపుడక నప్పలేదు అంటున్నారు నెటిజన్స్. అలాంటి ముక్కుపుడక పెట్టుకోవాలంటే మొఖం మరింత క్రూరంగా ఉండాలి. కానీ పృథ్వీరాజ్ సుకుమార్ ముఖం, అతని పక్క పాపిడి హెయిర్ స్టైల్ కి ఆ ముక్కుపుడక నప్పలేదు అంటున్నారు. సై సినిమాలో ప్రదీప్ రావత్ కి ఆ ముక్కుపుడక నప్పింది.కానీ పృధ్వీరాజ్ సుకుమారన్ సుకుమారమైన ముఖానికి ఇది ఎబెట్టుగా ఉంది అంటున్నారు.

మరి దీనిపై ప్రశాంత్ నీల్ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇదే సినిమాలో జగపతిబాబు కూడా ఒక విలన్ గా నటిస్తున్నారు. ప్రభాస్ పక్కన హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. సూపర్ స్టార్ హీరోగా, సూపర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వాళ్ళిద్దరికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -