Posani-Jagan: పోసాని, జగన్ పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

Posani-Jagan: ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళీపై నిర్మాత నట్టి కుమార్ విరుచుకుపడ్డారు. నీలాగ సినిమా పరిశ్రమను అభివృద్ది పథంలో తీసుకెళ్లిన వాళ్లు ఇప్పటివరకు ఎవరూ లేరు అంటూ పరోక్షంగా ఆయన పై సెటైర్స్ వేస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టికెట్ల రేట్ల విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

 

సినిమా టికెట్ల రేట్లు పెంచాలి అంటే బడ్జెట్ 100 కోట్లు దాటి ఉండాలని జిఎస్టి బిల్లలు కూడా తమకు అందించాలి అని ఎన్నో నిబంధనలను పెట్టారు అయితే తాజాగా నాగార్జున హీరోగా నటించినటువంటి నా సామిరంగా సినిమాకు టికెట్ల రేట్లు పెంచడంతో నిర్మాత నట్టి కుమార్ పోసాని మురళీకృష్ణ అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా చేసింది మీ కులం వాళ్ళయిన మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అయితే సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటకపోయినా కూడా సినిమా టికెట్లు రేట్లు ఎలా పెంచుతారు. మీరు చెప్పినటువంటి నిబంధనలను మీరే తుంగలో తొక్కేస్తున్నారు. నాగార్జున నటించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటూ ఆయన ప్రశ్నించారు. అదే చిరంజీవి భోళా శంకర్, పవన్ కళ్యాణ్ బ్రో, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల బడ్జెట్ 100 కోట్లు దాటినా కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచలేదని ఈయన తెలిపారు.

 

ఇలా మీ కులపు వారికైతే ఒక న్యాయం మీ ప్రత్యర్థి వారికైతే మరొక న్యాయమా అసలు ఇదేమి పరిపాలన అంటూ జగన్మోహన్ రెడ్డి పై కూడా నట్టి కుమార్ విమర్శలు కురిపించారు. అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటామన్నటువంటి జగన్ ప్రభుత్వం నేడు ఆ అక్క చెల్లెమ్మలు రోడ్డుపైకి వచ్చిన పట్టించుకోలేదు. బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు ఆ డబ్బులు నీ సొంత డబ్బులు ఇస్తున్నావా ప్రజల డబ్బే కదా వారికి ఇస్తున్నావు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయిన ఈ పని చేస్తారు అంటూ ఈయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -