Puri Jagannadh: విలేకరి అలా అడిగేసరికి చాలా హర్ట్ అయ్యాను: పూరి జగన్నాథ్

Puri Jagannadh: డేరింగ్ అండ్ డాషన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా 25వ తేదీ విడుదల కావడంతో చిత్ర బృందం గుంటూరులో ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున చిత్ర బృందం హాజరయ్యారు.

ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ హలో గుంటూరు అంటూ అందరిని పలకరించారు. ఇలా మిమ్మల్ని అందరిని ఇక్కడ చూస్తుంటే అసలు ఇది ఫ్రీ రిలీజ్ వేడుకనా? సక్సెస్ మీటా అని తెలియడం లేదు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ విజయ్ దేవరకొండకు ఎంతమంది అభిమానులు ఉన్నారంటూనే ఆయనకు ఎక్కువగా అమ్మాయిలే అభిమానులుగా ఉన్నారని పేర్కొన్నారు.

లైగర్ సినిమాని మేము ఎంతో ఇష్టపడి చేశాము ఈ సినిమా ప్రతి ఒక్కరిని సందడి చేస్తుందని భావిస్తున్నాను అంటూ పూరి జగన్నాథ్ ఈ సినిమా గురించి తెలియజేశారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియదు కానీ ఇంతకుమించి భారీ బడ్జెట్ తో మరో సినిమా ప్లాన్ చేశామని ఈ సినిమా పై మాకు అంత కాన్ఫిడెంట్ ఉందని పూరి పేర్కొన్నారు.ఇకపోతే అక్కడికి వచ్చినటువంటి అభిమానులను ఉద్దేశిస్తూ మీరందరూ ఒక్క టికెట్ కొని సినిమా చూసిన చాలు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఈయన కామెంట్ చేశారు. ఆగస్టు 25వ తేదీ మీ కాలేజ్ కి హాలిడే ఇవ్వమని ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను తప్పకుండా మీరందరూ సినిమాకి వచ్చి బ్లాక్ బస్టర్ చేయాలని కోరారు.

అదేవిధంగా మైక్ టైసన్ గురించి మాట్లాడుతూ ముంబైలో ఈవెంట్ సందర్భంగా విలేకరి తనతో మాట్లాడుతూ అసలు మైక్ టైసన్ అంటే ఎవరు అని ప్రశ్నించారు.ఎంతో గొప్ప బాక్సర్ అయినటువంటి ఆయన మా సినిమాలో నటిస్తే చాలు అని నేను అనుకున్నాను. అలాంటి గొప్ప వ్యక్తి గురించి విలేఖరి అలా అడిగేసరికి హర్ట్ అయ్యానని ఆయన గురించి తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ చేయమని ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ లైగర్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -