Radhe Shyam: ఏంటి.. రాధేశ్యామ్ ట్రైన్ సీన్ ఇలా చేశారా?

Radhe Shyam:  టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 350 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు భారీ అంచనాలు మూటగట్టి పెట్టారు. కానీ ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టగానే అభిమానుల గుండె పగలగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే చాలా వరకు నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.

చివరకు ప్రభాస్ అభిమానులు నిరాశ పడక తప్పలేదు. ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరంగా చాలావరకు మెప్పించినప్పటికీ.. ప్రేక్షకులకు స్టోరీ అంతా రుచి లేని విధంగా అనిపించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటిగా ఒక ట్రైన్ సీన్ జరుగుతుంది.

ఈ సీన్ ట్రైలర్ లో సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా థియేటర్లో కూడా ఈ సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ ఈ సీన్ మేకింగ్ చేసిన వీడియో ఒకటి యూట్యూబ్ లో తెగ వైరల్ గా మారింది. ఆ సీన్ ను గ్రీన్ మ్యాట్ లో మేక్ చేసిన విధానం ఆ వీడియోలో గమనించవచ్చు.

గ్రీన్ మ్యాట్ లో పూజ హెగ్డే రన్నింగ్ ట్రైన్ లో బయటకు చూస్తున్నట్లు నిలబడింది. ఆ క్రమంలో పూజ హెగ్డే హెయిర్ గాలికి ఎగురుతున్నట్లు ఒక వ్యక్తి ఫ్యాన్ ద్వారా తన జుట్టును కదిలిస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ వీడియో గమనించిన సోషల్ మీడియా ప్రియులు ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా బాగానే మాయ చేసారు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అంతా VFXమహిమ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్ వెయ్యండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -