Raghurama Krishnamraju: అసెంబ్లీ బరిలోకి రఘురామ కృష్ణంరాజు.. ఆ సేఫ్ సీటును ఆయనకు కేటాయించారా?

Raghurama Krishnamraju: నర్సాపురం ఎంపీగా కొనసాగుతూ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు గెలిచిన తర్వాత ఈయన పార్టీకి వ్యతిరేకంగా మారారు . నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచినటువంటి ఈయన తిరిగి అక్కడిదించే పోటీ చేస్తానని భావించారు కానీ బీజేపీ కూటమిలో భాగంగా ఈ సీట్ బీజేపీకి కేటాయించిన రఘురామకృష్ణం రాజుకు మాత్రం టికెట్ ఇవ్వకపోవడంతో తనుకు టికెట్ రాకపోవడం వెనక కూడా జగన్ హస్తం ఉందంటూ ఈయన విమర్శలు చేశారు.

ఇలా జగన్ ప్రభుత్వం నుంచి గెలుపొందినటువంటి ఈయన జగన్ పై విమర్శలు చేశారు అయితే ఇతర పార్టీల నుంచి కూడా ఈయనకు టికెట్ రాకపోవడంతో జగన్ పైనే విమర్శలు చేశారు తనుకు టికెట్ రాకుండా ఆయన తెర వెనక కుట్రలు చేశారంటూ విమర్శలు కురిపించారు. అయినప్పటికీ నేను ఎన్నికలలో పోటీ చేయకుండా ఆగనని రఘురామ కృష్ణంరాజు శపథం చేశారు. ఇటీవల కూడా తాను ఎంపీగానా లేదా ఎమ్మెల్యే గాన పోటీ చేయబోతున్నాను అనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తానని ప్రకటించారు.

ఇప్పటికే బీజేపీ నుంచి లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అభ్యర్థుల జాబితాలను పూర్తిగా విడుదల చేశారు మరి ఈయన ఎలా పోటీ చేస్తారు కొంపదీసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే ఏదైనా పార్టీ నుంచే పోటీ చేస్తారా అనే విషయానికి వస్తే అందుతున్న సమాచారం ప్రకారం ఈయన ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని సమాచారం.

చంద్రబాబు నాయుడుతో ఈ విషయం గురించి పెద్ద డీల్ కుదుర్చుకున్నటువంటి రఘురామ కృష్ణంరాజు ప్రస్తుతం అక్కడ ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తప్పించి ఆ స్థానంలో రఘురామకృష్ణం రాజు టికెట్ ఇవ్వబోతున్నారని సమాచారం ఈ విషయం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలబడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈయనకు సీటు కేటాయిస్తే మంతెన రామరాజు ఎలా దీనిని తీసుకుంటారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -