Rajamouli-Chiranjeevi: చిరంజీవి జక్కన్న కాంబినేషన్ లో 1000 కోట్ల బడ్జెట్ తో మూవీ.. రూ.5000 కోట్ల టార్గెట్ తో?

Rajamouli-Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం అని చెప్పాలి.

ఇలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయడం కోసం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా రాజమౌళి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి డైరెక్షన్లో చిరంజీవి ఒక సినిమాలో చేయబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి కూడా ఎంతో మంచి స్టార్ సక్సెస్ అందుకున్నటువంటి హీరో ఈ క్రమంలోనే చిరంజీవి హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుంది అంటేనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇలా 1000 కోట్ల రూపాయలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాని ఐదువేల కోట్ల టార్గెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నారని సమాచారం.

1000 కోట్ల బడ్జెట్ సినిమా అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరొక స్టార్ హీరో చిరంజీవి కాంబినేషన్లో సినిమా అంటేనే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ వద్ద మరొక సంచలనం సృష్టించడం ఖాయమంటూ అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -