Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్.. అర్హపై అయాన్ ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

Allu Arjun: నేడు రాఖీ పౌర్ణమి కావడంతో ప్రతి ఒక్కరు కూడా తమ సోదరులకు రాఖీలు కడుతూ రాఖీ పౌర్ణమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి మొదలుకొని స్టార్ సెలబ్రిటీల వరకు కూడా ఎంతో ఘనంగా ఈ రాఖి వేడుకలను జరుపుకుంటున్నారు. అలాగే రాఖి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఇంట్లో కూడా రాఖీ పండుగ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇంట్లో రాఖి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

 

రాఖీ పండుగ సందర్భంగా అల్లు అర్హ తన అన్నయ్య అల్లు అయాన్ కి రాఖీ కడుతూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. అయితే తన చెల్లెలు రాఖీ కట్టడంతో బోలెడు గిఫ్ట్స్ ఇచ్చారని ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. అర్హ పై ప్రేమను కనబరుస్తూ తనకు భారీగా గిఫ్ట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక అర్హ అయాన్ కి మాత్రమే కాకుండా స్నేహ రెడ్డి తన చెల్లెలు సోదరులకు కూడా రాఖి కడుతూ ఈ పండుగను జరుపుకున్నారు.

 

ఈ రాఖీ పండుగ వేడుకలలో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. సిస్టర్స్ లేకపోయినా ఆయన కజిన్ సిస్టర్ తన చేతికి రాఖీ కట్టే అల్లు అర్జున్ కి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ అల్లు అర్హ అయాన్ మధ్య ఉన్నటువంటి ప్రేమను చూసి ఫీదా అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -