Ram Charan: తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్న రామ్ చరణ్!

Ram Charan: ఒక తరంలో ఒక వ్యక్తి సాధించిన కీర్తి ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులను కాపాడి తర్వాత తరానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారసుడిదే. ఇది ముఖ్యంగా సినీ, రాజకీయం, పారిశ్రామిక రంగాలలో.. తండ్రి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టడమే కాదు.. తాను కూడా తండ్రి స్థాయికి తగ్గకుండా పేరు తెచ్చుకోవడం ఒక పెద్ద సవాల్.

పవర్ స్టార్ రామ్ చరణ్ దీనిని ఘనంగా చాటారు. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు హీరోగా వస్తున్నాడు అంటే అభిమానుల్లో ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉంటాయి. చిరంజీవి స్వశక్తితో సాధించుకున్న గుర్తింపు రాంచరణ్ నిలబెట్టాల్సి రావడమే.

2007 సెప్టెంబర్ 28న చిరంజీవి తనయుడి తొలి సినిమా చిరుత విడుదల. 27న మెగా అభిమానుల్లో, సినీ ప్రేక్షకులలో మరునాడు విడుదలయ్యే సినిమా ఎలా ఉండబోతుంది. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అనే ఆతృత. చిరుత చూపులతో రామ్ చరణ్ పోస్టర్లలో మెరిసిపోతున్నాడు. ఇక థియేటర్లు మండపాలల ముస్తాబయ్యాయి.

ఇక 27 వ తేదీ రాత్రి 10 గంటల నుంచే షోలు వేయడం ప్రారంభించారు. ఇక రామ్ చరణ్ తెరపై ఎలా చేస్తాడో.. ఎలా కనిపిస్తాడో అనే అనుమానాలన్నీ ఫస్ట్ ఫైట్, ఫస్ట్ పాటతోనే మెగా వారసుడు అనిపించుకున్నాడని ఇక చిరంజీవి మార్క్ ఇంచు కూడా తగ్గలేదని అభిమానులు పులకరించిపోయారు.

పూరి జగన్నాథ్ మార్క్ టేకింగ్, మణిశర్మ మ్యూజిక్ హెల్ప్ అయ్యాయి. 28 నుంచి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో రామ్ చరణ్ పేరు మారుమోగిపోయింది. సినీ పెద్దలకు ప్రసాద్ ఐమాక్స్ లో 27న ప్రత్యేక షో ఏర్పాటు చేశారు చిరంజీవి. రజనీకాంత్ చెన్నైలో ఈ సినిమా చూశారు. ఇక ఫ్యాన్స్ నుండి సెలబ్రెటీల వరకు అందరి నోట తండ్రికి తగ్గ తనయుడు అనే మాట వినిపించింది. సినీ ప్రముఖులు చిరంజీవి పేరు నిలబెట్టాడు అని పేర్కొనడం జరిగింది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న గాడ్ ఫాదర్ సినిమాకు నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు చరణ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -