Sai Dharam Tej: బంగారం లాంటి రికార్డ్ మిస్ చేసుకున్న సాయితేజ్.. ఏం జరిగిందంటే?

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బంగారం లాంటి రికార్డుని మిస్ చేసుకుంటున్నారు. మీరు విన్నది నిజమే. అయితే ఏంటా రికార్డు అనుకుంటున్నారా.. అదేనండి ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష సినిమా గురించే మనం మాట్లాడుకునేది. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ, సుకుమార్ రేటింగ్స్ బ్యానర్లపై బిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష.

ఈ సినిమా ఊహించని రేంజ్ లో హిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా సాయి ధరంతేజ్ కూడా 100 కోట్ల క్లబ్లో చేరాలని కలలు కన్నాడు. ప్రస్తుతం 92 కోట్లు క్రాస్ చేసింది కూడా కానీ అనుకోని విధంగా ఈ మూవీని ఓటీటీ లో రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు మూవీ మేకర్స్. ఫ్లాప్ మూవీస్ ఓటీటీ కి అమ్ముకున్నారంటే అందులో అర్థం ఉంది.

 

కానీ హిట్ సినిమా కూడా ఎందుకు అంత తొందరగా ఓటీటీ కీ ఇస్తున్నారు ఎందుకంత కక్కుర్తి అంటూ తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు నెటిజెన్స్. విచారించవలసిన విషయం ఏమిటంటే ఎప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్స్ తో విరూపాక్ష మూవీ నడుస్తుంది. ఇంకొన్ని రోజులు ఆగితే కచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరుతుంది.

 

మూవీ మేకర్స్ ఈ మూవీని ఓటీటీ కి ఇవ్వడం ద్వారా సాయి ధరమ్ తేజ్ 100 కోట్ల క్లబ్ కలగానే మిగిలిపోయేటట్లుగా ఉంది. సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు బద్దలు కొట్టారు. అప్పటినుంచి సాయి ధరమ్ తేజ్ 100 కోట్ల క్లబ్లో చేరాలని మరింత కసి మీద ఉన్నారు.

 

వైష్ణవ్ తేజ్ సాధించిన రికార్డు సాయిధరమ్ తేజ్ సాధించలేకపోతున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఆదివారమే విరూపాక్ష నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. చూడాలి మరి విరూపాక్ష అక్కడ ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -