Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్.. అలాంటి కటౌట్ ప్లాన్ చేశారా?

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది. దీంతో ప్రభాస్ రేంజ్ ని దృష్టిలో ఉంచుకొని తదుపరి సినిమాల ప్రమోషన్లను ఈవెంట్లను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

 

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్. కల్కి 2898AD ప్రమోషన్స్ ఇప్పటికే ఆడియన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్, డైరెక్టర్ మారుతితో ఒక హారర్ థ్రిల్లర్ ను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ పడనుంది. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను మేకర్స్ వేరే లెవెల్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ కటౌట్ లాంఛ్ కి మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు.

జనవరి 15, ఉదయం 6:30 గంటలకి వెంప కాసి కోడి పందెం బరి పెడమెరం, భీమవరంలో లాంఛ్ చేయనున్నారు. మొదటి సారిగా ఒక డిజిటల్ కటౌట్ ను లాంఛ్ చేయడం, అది కూడా ప్రభాస్ మూవీకి కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజీని అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నాడు. ఇటీవలే విడుదలైన సలార్ సినిమా ప్రభాస్ కు భారీగా ఊరటనిచ్చింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -