Bank: ఆ బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసిన ఆర్బీఐ.. ఏమైందంటే?

Bank: తాజాగా ఆర్బీఐ ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈసారి ఒకటి రెండు కాదు ఏకంగా 8 బ్యాంకులపై వేటు వేసింది ఆర్బిఐ. అదేమిటంటే 8 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా బ్యాంకుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆర్బిఐ రంగంలోకి దిగి చదర బ్యాంకులపై కఠినమైన చర్యలు తీసుకుంది. కాగా 8 సహకార బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసింది. కాగా ఆ బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.

ముధోల కో ఆపరేటివ్ బ్యాంక్, శ్రీ ఆనంద్ కోఆపరేటివ్ బ్యాంక్, మిలాత్ కో ఆపరేటివ్ బ్యాంక్, రూపి కో ఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్, దక్కన్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్, సేవా వికాస్ కో ఆపరేటివ్ బ్యాంక్, బాబాజీ డేట్ ఉమెన్స్ అర్టన్ బ్యాంక్ లు. బ్యాంకుల్లో తగిన మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, అదేవిధంగా బ్యాంకుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ 8 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

అలాగే భవిష్యత్తులో ఆదాయం తగ్గే అవకాశం ఉన్నందున కూడా లైసెన్సులను రద్దు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు మరికొన్ని బ్యాంకులకు ఆర్బీఐ భారీగా జరిమానాలు కూడా విధించింది. సెంట్రల్ బ్యాంక్ తో పాటుగా మరికొన్ని బ్యాంకులకు భారీగా జరిమానాలు విధించినట్టు తెలుస్తోంది. అలాగే నిబంధనలు పాటించని బ్యాంకులకు 114 సార్లు జరిమానా వేసింది. గత ఆర్ధిక సంవత్సరంలో 8 సహకార బ్యాంకుల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు ఇపుడు మరికొన్నింటికి ఫైన్ వేశారు. కాగా సహకార బ్యాంకులను బలోపేతం చేయడంపై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. అందులో భాగంగా సహకర బ్యాంకులపై నిఘా పెట్టింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -