YS Sharmila: షర్మిలాను కాంగ్రెస్ చేరదీయడం వెనకాల అసలు విషయం ఇదేనా….?

YS Sharmila: వైయస్ షర్మిల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా మంచి ప్రాచుర్యం పొందారు. అన్న జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు అన్న వెనకాలే నడిచారు. జగనన్న వదిలిన బాణంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ముందుకు నడిచారు.
అయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం వెనకాల షర్మిల చేసిన కృషి ఎంతో ఉంది జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని ముందుంచి నడిపించిన షర్మిలానే. ఒక పక్క తల్లి విజయమ్మ మరోపక్క సోదరి షర్మిల పాదయాత్ర బస్సుయాత్ర పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లారు.

 

అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని దూరం పెట్టిన సంగతి తెలిసిందే తర్వాత షర్మిల తన దారి తన వెతుక్కుంటూ తెలంగాణ వెళ్లి వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అక్కడ కూడా తన ప్రభావాన్ని చూపించే విధంగా పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఒక వ్యూహాన్ని రచించింది. ప్రజా ఆదరణ కలిగిన షర్మిలాని తమతో చేర్చుకుంటే విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ బలపడవచ్చు అనే వ్యూహం రచించింది. అందుకే తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల తో సంప్రదింపులు జరిపించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడారు. ఇక్కడ కాంగ్రెస్ తెలివిగా వ్యవహరించి షర్మిల ని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేర్చుకోలేదు. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. ఒకవేళ షర్మిల కాంగ్రెస్ లో చేరితే అది ప్రభావం చూపిస్తుందని చేర్చుకోలేదు. కనీసం షర్మిలాని ప్రచారానికి కూడా వాడుకోలేదు.

షర్మిల కాంగ్రెస్ లో చేరుతుంది అనే ప్రచారానికి ముందు నుంచి గానే షర్మిలాని ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం చేయనున్నారని వార్త వినిపించింది.షర్మిలాకు పిసిసి పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ నాయకులు సైతం సుముకంగా ఉన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా చతికల పడింది. షర్మిల లాంటి చరిష్మా ఉన్న నేత కాంగ్రెస్ కి అధ్యక్షురాలు అయితే ఎంతోకొంత పూర్వ వైభవం తెచ్చుకోవచ్చు అనేది కాంగ్రెస్ ప్లాన్. అయితే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చేసారు కాబట్టి ఆమెను కాంగ్రెస్ చేరదీస్తే జగన్ పైన కక్ష తీర్చుకునేందుకు కూడా కాంగ్రెస్ కు అవకాశాలు లభించినట్టు అవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా వైయస్సార్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అయింది.ఇప్పుడు షర్మిలాని రంగంలోకి దింపితే ఆ ఓటు బ్యాంకు అంతా తమకు తిరిగి వస్తుందని కాంగ్రెస్ నమ్ముతుంది.

 

అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా పూర్వ వైభవం రావడం అనేది జరగని పని అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శర్మలతో కేవలం ఒకటి రెండు శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయి అని చెబుతున్నారు. షర్మిలా కాంగ్రెస్ లో చేరడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే షర్మిల జగన్ మోహన్ రెడ్డికి ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు గండి కొడతారని నమ్మకం టిడిపికి ఉంది. ఇదే గనుక జరిగితే ఇది టిడిపికి లాభపడే విషయమే. ఏది ఏమైనా సరే అందరూ కలిసి టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దింపేయాలని చేస్తున్న ప్రయత్నాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకపక్క చెల్లి షర్మిల దెబ్బ మరోపక్క పార్టీలు మారుతున్న సొంత నాయకుల దెబ్బతో జగన్మోహన్ రెడ్డి కుదేలవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -