Hanuman: హనుమాన్ మూవీ 5 రూపాయల విరాళం వెనుక అసలు స్ట్రాటజీ ఇదేనా?

Hanuman: ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సినిమాలో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి ఆది పురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా సమయంలో ప్రతి ఒక్కరిలోనూ భక్తి భావం బయటపడింది అయితే ఈ సినిమాని చూడడం కోసం పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులలో మాత్రం ఎక్కడో చిన్నపాటి నిరుత్సాహంతో బయటకు వచ్చారు.

 

ఇదిలా ఉండగా తాజాగా ఇదే బాటలోనే మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా నటించిన హనుమాన్ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా టికెట్ కొనుగోలుపై ప్రతి ఐదు రూపాయలు అయోధ్యలో రామ మందిరానికి విరాళంగా వెళుతుంది అంటూ డైరెక్టర్ వెల్లడించారు. ఇలా ప్రతి ఐదు రూపాయలు టికెట్ మీద రాములు వారి ఆలయానికి పంపించడం అనే దాని వెనుక నిర్మాతల స్టాటజీ ఉంటుందని చెప్పాలి. చాలామందిలో భక్తి భావం కలిగి మనం టికెట్ కొనుగోలు చేయడం ద్వారా ఆ డబ్బు రాముల వారి ఆలయానికి వెళుతుందన్న ఉద్దేశంతో సినిమా చూసేకి వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పాలి.

 

ఇలా ఈ సినిమా కలెక్షన్లను కూడా ఒక విధంగా క్యాష్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నింటిని సక్రమంగా పాటిస్తారా లేకపోతే గాలికి వదిలేస్తారా అనే విషయానికి వస్తే ప్రతిరోజు ఎంత మొత్తంలో టికెట్లు అమ్ముడుపోయాయి ఎంత డబ్బు మనం అయోధ్య రామ మందిరానికి చెల్లిస్తున్నాము అనే విషయాలన్నింటిని కూడా పక్కాగా మీడియాకు తెలియజేయబోతున్నామని డైరెక్టర్ తెలిపారు. మరి అందరిలోనూ భక్తి భావం బయటకు వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -